దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలను తరలిస్తూ గురువారం ఇద్దరు జాంబియా దేశస్థులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.98 కోట్లు విలువ చేసే 14 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు.
రూ.98 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్న జాంబియా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి నుంచి రూ.98 కోట్లు విలువచేసే డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ స్వాధీనం, ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
సౌతాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ నుంచి ఖతార్ గుండా పయనిస్తూ వారు భారత్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:మధ్య సీటు ఖాళీతో కరోనా ముప్పు తక్కువే!