తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసలే భార్యను కోల్పోయిన బాధ.. ఆపై మూకదాడి.. యువకుడు మృతి - Young man beaten to death on suspicion of theft

Aurangabad young man murder: దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ యువకుడిని కొట్టి చంపారు ఓ ఎనిమిది మంది వ్యక్తులు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో జరిగింది.

Aurangabad Young man beaten to death
భార్య మరణించిన నెల రోజులకే భర్త మృతి

By

Published : Apr 21, 2022, 4:28 PM IST

Updated : Apr 21, 2022, 5:39 PM IST

Aurangabad young man murder: దొంగతనం చేశాడనే అనుమానంతో ఎనిమిది మంది వ్యక్తులు ఓ యువకుడిని కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో జరిగింది. మృతుడ్ని మేఘావాలే ఫంక్షన్​ హాల్​లో పని చేస్తున్న మనోజ్‌ శేషారావు అవద్‌(27)గా పోలీసులు గుర్తించారు.

మనోజ్ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య మహేరి నెల రోజుల క్రితం మృతి చెందింది. అతడు ఆ బాధలో ఉండగా.. మేఘావాలే హాల్​లో జరిగిన దొంగతనానికి మనోజ్ కారకుడంటూ 8 మంది అతడ్ని చితకబాదారు. మనోజ్ తల్లి ఫిర్యాదు మేరకు సిడ్కో పోలీస్ స్టేషన్‌లో సతీష్ ఖరే, ఆనంద్ సోక్లాస్, ఆనంద్ గైక్వాడ్, సాగర్ ఖరత్, అష్టపాల్ గవాయ్‌పై హత్య కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారికోసం గాలిస్తున్నారు.

మనోజ్​పై దాడిని మొబైల్​లో చిత్రీకరించారు నిందితులు. ఈ వీడియోను మనోజ్ సోదరుడికి పంపారు. అతడు మేఘవాలే హాల్​కు చేరుకునే లోపు మనోజ్​ను ఆసుపత్రిలో చేర్పించి నిందితులు పరారయ్యారు. అప్పటికే మనోజ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:సైన్యం రివెంజ్.. పోలీస్, జవాన్​ను చంపిన ఉగ్రవాది హతం

Last Updated : Apr 21, 2022, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details