బిహార్లో ముజఫర్పుర్ జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. ఓ మహిళ తనకు పిల్లలు లేరనే అసూయతో తన వదిన కుమారుడు(మేనల్లుడిని) హతమార్చింది. అనంతరం శవాన్ని బెడ్రూంలోనే పూడ్చి.. చెడు వాసన రాకుండా అగరబత్తులు వెలిగించి మెనేజ్ చేసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విభాదేవి అనే మహిళ బొచ్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్తిపుర్ గ్రామంలో నివసిస్తోంది. ఆమెకు పిల్లలు లేరు. పైగా తరచూ భర్తతో గొడవలు పడుతూ ఉండేది. అయితే తన వదిన.. పిల్లలతో సంతోషంగా ఉండడం చూసి విభాదేవి అసూయతో రగిలిపోయింది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో మూడున్నరేళ్ల తన వదిన కుమారుడిని చంపేసింది. అనంతరం తన బెడ్రూంలో గొయ్యి తవ్వి బాలుడి శవం పాతిపెట్టింది. మట్టి కప్పి.. చెడు వాసన రాకుండా అగరబత్తులు వెలిగించి మేనేజ్ చేసింది. ఈ క్రమంలో పనులకు వెళ్లి తిరిగి వచ్చిన బాలుడి కుటుంబ సభ్యులు 'పిల్లాడు ఎక్కడా' అని విభాదేవిని అడగగా.. తనకు తెలియదంటూ బుకాయించింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు బాలుడి కోసం ఊరంతా గాలించారు.