తెలంగాణ

telangana

ETV Bharat / bharat

August 15 Special Discount Offers : పంద్రాగస్టున ఆఫర్లే ఆఫర్లు.. ఇటు రీఛార్జ్ చేయండి.. అటు బిర్యానీ తినండి.. - ఆగస్టు 15 స్విగ్గీ ఆఫర్స్

Independence Day Special Discount Offers : ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాపార సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఇందులో.. మొబైల్ నెట్వర్క్ కంపెనీల నుంచి ఫుడ్ డెలివరీ సంస్థల దాకా ఉన్నాయి. మరి, ఎంత తగ్గింపు ధరలు అమలు చేస్తున్నాయి? ఏయే వస్తువులు అందుబాటులో ఉన్నాయి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దామా..!

August 15 Special Discount Offers
August 15 Special Discount Offers

By

Published : Aug 14, 2023, 3:53 PM IST

August 15 Special Discount Offers 2023 : వ్యాపార సంస్థలుతమ అమ్మకాలను పెంచుకోవడానికి సందర్భం కోసం ఎదురు చూస్తుంటాయి. వినియోగదారులు సైతం.. తగ్గింపు ధరలతో వస్తువులు కొనుగోలు చేయడానికీ సందర్భం కోసం వేచి ఉంటారు. వీరిద్దరికీ ఇష్టమైన ఆ సందర్భమే ఫెస్టివల్. ఈ క్రమంలోనే.. ఇద్దరికీ అవసరమైన ఫెస్టివల్ వచ్చేసింది. అదే.. జెండా పండుగ. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాపార సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. మొబైల్ నెట్వర్క్ కంపెనీల నుంచి ఫుడ్ డెలివరీ సంస్థల దాకా ఆఫర్లు రిలీజ్ చేశాయి. మరి, ఈ లిస్టులో ఏయే సంస్థలు ఉన్నాయి? ఎంత తగ్గింపు ధరలు అమలు చేస్తున్నాయి? ఏయే వస్తువులు అందుబాటులో ఉన్నాయి? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

మొబైల్ నెట్వర్క్ సంస్థలు..

Mobile Networks Independence Day Offers :

రిలయన్స్ జియో (Reliance Jio Offers) : దేశంలో దిగ్గజ మొబైల్ నెట్వర్క్ గా కొనసాగుతున్న రిలయన్స్ జియో అందరికన్నా ముందుగా ఇండిపెండెన్స్ డే ఆఫర్లు ప్రకటించింది.

ఇందులో భాగంగా కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.2,999 చెల్లిస్తే.. 365 రోజుల కాలవ్యవధితో జియో సేవలు లభిస్తాయి.

ఈ ప్లాన్ లో అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5 GB డేటా, 100 SMSలు లభిస్తాయి.

వొడాఫోన్ ఇండియా (Vodafone India Offers ) : జియో ప్రత్యర్థి వొడాఫోన్ ఇండియా (VI) కూడా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా.. రూ.199 పైన ఉన్న అన్ని అన్ లిమిటెడ్ డేటా రీఛార్జ్‌లపై 50 GB డేటా అందిస్తోంది.

దీనితో పాటు మరో ఆఫర్ కూడా ప్రకటించింది. రూ.1,449 రీఛార్జ్ ప్యాక్ పై రూ.50 తగ్గింపు, రూ. 3,099 రీఛార్జ్ ప్యాక్​పై రూ.75 తక్షణ తగ్గింపును ప్రకటించింది.

ఇక, Vi యాప్‌లో 'స్పిన్ ది వీల్' పోటీని సైతం నిర్వహిస్తోంది. ఈ పోటీలో.. ప్రతి గంటకూ ఓ లక్కీ విన్నర్ ఉంటాడని ప్రకటించింది. ఈ విన్నర్​ ఏడాదిపాటు చెల్లుబాటయ్యే రూ.3,099 విలువైన రీఛార్జ్ ప్యాక్‌ అందిస్తామని చెప్తోంది.

ఇంకా.. 1GB, 2GB అదనపు డేటా, SonyLiv సబ్‌స్క్రిప్షన్‌ సహా ఇతర రివార్డ్‌లు సైతం గెలుచుకోవచ్చని ప్రకటించింది.

VI అందిస్తున్న ఈ ఆఫర్లు ఆగస్టు 18 వరకు అందుబాటులో ఉంటాయి.

స్విగ్గీ (Swiggy Offers): ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ భారతీయులకు నోరూరించే ఆఫర్ ప్రకటించింది. రూ.249 లేదా అంతకంటే ఎక్కువ ఆర్డర్ చేస్తే.. రూ.100 తగ్గిస్తామని చెప్తోంది.

యాత్ర (Yatra Offers ): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. విమాన టికెట్ల బుకింగులపై రూ.1,500 వరకు తగ్గింపు ఇస్తున్నట్టు యాత్ర ప్రకటించింది. దేశీయ హోటల్ బుకింగ్‌లపై రూ.4 వేల వరకు తగ్గింపు పొందవచ్చని చెప్తోంది.

అజియో (Ajio Offers) : ఆన్ లైన్ షాపింగ్ స్టోర్ అజియో కూడా ఆఫర్ ప్రకటించింది. రూ.999 ఆర్డర్‌పై ఫ్లాట్ రూ.200 తగ్గిస్తామని చెప్పింది. అయితే.. ఎంపిక చేసిన ఉత్పత్తులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

నెట్​మెడ్స్ (Netmeds Offers): ఈ ఆన్​లైన్ ఫార్మసీ సేల్ సంస్థ.. రూ. 999+NMS సూపర్‌క్యాష్ ఆర్డర్‌లపై 20% తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది.

రిలయన్స్ డిజిటల్ (Relianace Degital) : సెలక్టివ్ ఆడియో యాక్సెసరీలపై 10%, సెలక్టివ్ గృహోపకరణాలపై 10% ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుందని ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details