Dos and Don'ts in Flag Hoisting: భారతదేశ స్వేచ్ఛకు, స్వాతంత్య్రానికి గుర్తు మూడు రంగుల జాతీయ పతాకం. ఇది దేశ ఐక్యతను సూచిస్తుంది. ఇందులోని ఒక్కో రంగు ఒక్కో భావానికి గుర్తు. పైనుండే కాషాయ రంగు ధైర్యానికి, త్యాగానికి గుర్తు. మధ్యలో తెల్లుపు వర్ణం శాంతికి, సత్యానికి, స్వచ్ఛతకు చిహ్నం. కింద ఉన్న ఆకుపచ్చ రంగు.. వృద్ధిని సూచిస్తుంది.
ఇక, మువ్వన్నెల జెండా (August 15 quotes and WhatsApp status) మధ్యలోని చక్రాన్ని అలనాటి చక్రవర్తి అశోకుడి సింహ రాజధాని నుండి తీసుకున్నారు. ఈ చక్రంలోని 24 ఆకులు ఉంటాయి. దీన్ని ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. మన జాతీయ జెండాని ఆవిష్కరించడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పలు మార్గదర్శకాలను రూపొందించింది. ఆ నిబంధనల ప్రకారమే.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలి.
జెండా గౌరవానికి భంగం కలిగించడం అనేది శిక్షార్హమైన నేరం కూడా. అందుకే.. ప్రతి ఒక్కరూ త్రివర్ణ పతాకాన్ని గౌరవిస్తూ.. నిబంధనలకు లోబడి ఆవిష్కరించాలి. మరి, ఆ రూల్స్ ఏంటో.. వాటిని ఎలా పాటించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
August 15 Happy Independence Day : "స్వాతంత్య్రోద్యమ కాలంలో.. ఓ రోజు అలా" అందుకే శుభాకాంక్షలు చెప్పండి ఇలా!
ఇవి చేయాలి..
Dos in Flag Hoisting:
- ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. పౌరులందరికీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించే హక్కు ఉంది.
- జెండాను ఎగురవేసేటప్పుడు తలకిందులుగా ఆవిష్కరించకూడదు. అంటే.. కాషాయ రంగు పైభాగంలో ఉండాలి. ఆకుపచ్చ రంగు కింది భాగంలో ఉండాలి.
- పతాకం 2:3 నిష్పత్తిలో ఉండాలి. ఇంతకన్నా తక్కువ, ఎక్కువ ఉండకూడదు.
- వేదికల మీద, గోడకు ఏర్పాటు చేసినప్పుడు కూడా.. జెండాను ఇష్టారీతన పెట్టకూడదు. కాషాయ రంగు పైనే ఉండేలా చూసుకోవాలి.
- జాతీయ జెండాను ఎక్కడ ఆవిష్కరించినా.. ప్రత్యేకంగా ఉండాలి. అంతేతప్ప.. ఇతర జెండాల సమూహంలో కలిసిపోయేలా ఉంచకూడదు.
- జెండాను ఎగురవేసే వారు గౌరవప్రదమైన దుస్తులు ధరించాలి.
- ఆవిష్కరిస్తున్నప్పుడు.. ఇంకా అవనతం చేస్తున్నప్పుడు.. తప్పనిసరిగా వందనం చేయాలి.
- అవనతం చేసినప్పుడు పతాకాన్ని త్రిభుజాకారంలో చక్కగా మడిచి, గౌరవప్రదంగా నిల్వ చేయాలి.
- జెండా ఇక ఆవిష్కరించలేని విధంగా చిరిగిపోయినా.. వెలిసిపోయినా.. చక్కగా మలిచి ఒక పెట్టెలో పెట్టి.. ఎవ్వరూ చూడకుండా భూమిలో పాతిపెట్టాలి. లేదంటే కాల్చివేయాలి. ఎవ్వరికీ కనిపించకుండా ఈ పని పూర్తి చేయాలి.
కోహ్లీ హెల్మెట్‌పై ఉన్న జాతీయ జెండా చిహ్నం.. ధోనీకి ఎందుకు లేదో తెలుసా?
ఇవి చేయకూడదు..
Don'ts in Flag Hoisting:
- త్రివర్ణ పతాకాన్ని అలంకారం కోసం ఉపయోగించకూడదు. టేబుల్ క్లాత్‌గా, చేతి రుమాలుగా ఉపయోగించకూడదు.
- జెండాపై అడుగు పెట్టకూడదు. నేలను, నీటిని పతాకం తాకకుండా చూడాలి.
- వాహనాలపై కప్పే వస్త్రంగా జాతీయ జెండాను ఉపయోగించకూడదు. అలా చేస్తే.. శిక్షార్హమైన నేరం అవుతుంది.
- త్రివర్ణ పతాకం కంటే ఎత్తుగా.. మరే ఇతర జెండానూ ఉంచకూడదు.
- చిరిగిపోయిన, వెలిసిపోయిన జెండాను ఆవిష్కరించకూడదు.
- జెండాను ఎప్పుడూ స్తంభం సగం వరకు మాత్రమే ఎగరేయకూడదు. పతాకాన్ని పూర్తిగా చివరన ఆవిష్కరించాలి.
- జెండాపై ఏవిధమైన నినాదాలు, పదాలు, డిజైన్లు రాయకూడదు.
- బహిరంగంగా జెండాకు నిప్పు పెట్టడం.. తూలనాడటం చాలా పెద్ద నేరం.
ప్రతి ఒక్కరికీ త్రివర్ణ పతాకం చెప్పే జీవితపాఠాలివే
జాతీయ జెండా రూపకల్పన ఆలోచన అలా మెుదలైంది..