సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూపై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించే వ్యవహారం నుంచి తాను వైదొలగుతున్నట్లు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు. అనుమతి విషయాన్ని సొలిసిటర్ జనరల్ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టులో విచారణ సందర్భంగానూ, ఆ తర్వాతా మనదేశ సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా జస్టిస్ కట్జూ వ్యాఖ్యలు చేశారని, ఇందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అనుమతించాలని కోరుతూ అటార్నీ జనరల్‌కు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మార్చి1న పిటిషన్ సమర్పించారు.