కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే కొన్ని దేశాలు, రాష్ట్రాలు ప్రయాణికుల్ని.. అనుమతిస్తున్నాయి. కానీ ఉత్తరాఖండ్, హరిద్వార్‌కు చెందిన ఓ కాబోయే జంట.. తమ వివాహానికి రావాలంటే బంధువులకు ఆర్టీ- పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. వివాహ ఆహ్వాన పత్రికపై ఇది ముద్రించడమే విశేషం. ఈ విషయంపై పలువురు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.
హరిద్వార్‌కు చెందిన వరుడు విజయ్.. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన వధువు వైశాలి ఈ నెల 24న ఒక్కటికానున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించేందుకే ఇలా చేశామని చెబుతున్నారు.
''మేం విహహ పత్రికలు పంచడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త నిబంధనలను జారీ చేశాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాం.''
-విజయ్, వరుడు