తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మంత్రిపై దాడికి యత్నం.. పదునైన ఆయుధం, విషంతో... - ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు

UP election 2022: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర మంత్రి సిద్ధార్థ్​ నాథ్​ సింగ్​పై దాడికి యత్నించాడు ఓ దుండుగుడు. ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దుండగుడి నుంచి పదునైన ఆయుధం, ఓ విషం బాటిల్​ను స్వాధీనం చేసుకున్నారు.

Siddharthnath Singh
సిద్ధార్థ్​ నాథ్​ సింగ్​

By

Published : Feb 3, 2022, 2:22 PM IST

UP election 2022: ఉత్తర్​ప్రదేశ్​ కేబినెట్​ మంత్రి సిద్ధార్థ్​ నాథ్​ సింగ్​పై ఓ దుండుగుడు దాడికి యత్నించాడు. ఆయన భద్రతా సిబ్బంది అప్రమత్తతతో తృటిలో ప్రమాదం తప్పింది.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మంత్రి.. ప్రయాగ్​రాజ్​ జిల్లాలోని ముంద్రా ప్రాంతంలో నామినేషన్​ పత్రాలు దాఖలు చేసేందుకు గురువారం వెళ్లారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా పదునైన ఆయుధంతో మంత్రిపై దాడికి యత్నించాడు దుండగుడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై అతడిని తోసివేశారు. అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించగా.. భద్రతా సిబ్బంది, భాజపా కార్యకర్తలు అతడిని పట్టుకున్నారు.

దుండగుడి నుంచి పదునైన ఆయుధం, ఓ విషం బాటిల్​ను స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది.

ఇదీ చూడండి:UP Election 2022: హత్యలు, అత్యాచార కేసుల నిందితులే అభ్యర్థులు!

ABOUT THE AUTHOR

...view details