తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

Attacks on Margadarshi Offices: కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా మార్గదర్శిపై మళ్లీ దాడులకు తెగబడిన జగన్ ప్రభుత్వం... వరుసగా రెండోరోజూ అదే ధోరణితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంస్థ కార్యాలయాల్లో సీఐడీ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.

Attacks on Margadarsi Offices
Attacks on Margadarsi Offices

By

Published : Aug 18, 2023, 7:40 PM IST

Updated : Aug 18, 2023, 8:39 PM IST

Attacks on Margadarsi Offices: కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు

Attacks on Margadarsi Offices :కోర్టు ఆదేశాలు ఏమాత్రం పట్టించుకోకుండా మార్గదర్శిపై మళ్లీ దాడులకు తెగబడిన జగన్ ప్రభుత్వం.. వరుసగా రెండోరోజూ అదే ధోరణితో వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సంస్థ కార్యాలయాల్లో సీఐడీ సహా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. కొన్ని బ్రాంచిల్లో షట్టర్లు మూసి కస్టమర్లను వెనక్కి పంపుతున్నారు. కొన్నిచోట్ల చిట్ ఇన్ స్టాల్ మెంట్ కట్టేందుకు వచ్చినవారిని వెనక్కి వెళ్లాలని ఆదేశిస్తున్నారు. మార్గదర్శి బ్రాంచిల్లో విధులకు వచ్చిన సిబ్బంది సెల్ ఫోన్లు తీసుకుంటున్నారు.

margadarshi chitfund : 'ఉల్లంఘనలు అబద్ధం.. ప్రభుత్వ దాడి నిజం'

ప్రకాశం జిల్లా ఒంగోలుమార్గదర్శి కార్యాలయంలో సీఐడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గురువారం తనిఖీలు నిర్వహించిన రెవెన్యూ, సీఐడీకి చెందిన 8 మంది సిబ్బంది.. ఇవాళ ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మళ్లీ సోదాలు ప్రారంభించారు. మీడియా వారిని వెళ్లిపోమని సీఐడీ అధికారులు ఆదేశించారు.

కర్నూలు మార్గదర్శి కార్యాలయంలోరెండోరోజూ తనిఖీలు కొనసాగుతున్నాయి. గత అర్ధరాత్రి ఒంటి గంట వరకు తనిఖీలు చేసిన సీఐడీ అధికారులు... ఇవాళ ఉదయం మళ్లీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో సీఐడీ సీఐ డేగల ప్రభాకర్, చిట్స్ రిజిస్ట్రార్ మల్లికార్జున, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు. కార్యాలయంలోకి ఎవరినీ పోలీసులు రానివ్వలేదు.

హైకోర్టు స్టే ఇవ్వటం మార్గదర్శి సంస్థ నిబద్దతకు నిదర్శనం: సీనియర్ న్యాయవాది రాజేంద్రప్రసాద్​

కడప, ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయాల్లోసీఐడీ అధికారుల సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. జిల్లా చిట్ రిజిస్ట్రార్ భారతితో పాటు సీఐడీ సీఐ ఆంజనేయ ప్రసాద్ ఆధ్వర్యంలోని 8 మంది సభ్యుల బృందం... కడప మార్గదర్శి కార్యాలయానికి ఉదయం 8 గంటలకే చేరుకొని... తనిఖీలు మొదలుపెట్టింది. ఇద్దరు రెవెన్యూ సిబ్బంది వీరితో పాటు ఉన్నారు. ఇటీవల మార్గదర్శిలో గడువు ముగిసిన ఐదు చిట్ గ్రూపుల వివరాలను జిల్లా చిట్ రిజిస్ట్రార్ ( Chit Registrar )పరిశీలించారు. దాదాపు 200 నుంచి 250 మంది కస్టమర్ల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వారితో మాట్లాడారు. చీటీ పాడుకున్నప్పుడు ష్యూరిటీలు సమర్పించడంలో ఏమైనా ఇబ్బందులు పెట్టారా... అనే విషయంపై గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు పెట్టడం లేదని కస్టమర్లు సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ కస్టమర్లను తికమకపెట్టే ప్రశ్నలు అడుగుతూ వారిని కార్యాలయానికి పిలిపించే చర్యలు చేపట్టారు. కడప, ఎర్రగుంట్లకు చెందిన ఇద్దరు కస్టమర్లను కడప మార్గదర్శి కార్యాలయానికి పిలిపించి వివరాలు సేకరించారు. కస్టమర్లకు ఫోన్లు చేసేటప్పుడు మార్గదర్శి మేనేజర్, సిబ్బంది మొబైల్ ఫోన్లను వినియోగించారు. ప్రొద్దుటూరు మార్గదర్శి కార్యాలయంలోనూ... క్లోజ్ చేసిన గ్రూపులకు సంబంధించి వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

AP Government Once Again Actions on Margadarsi: మార్గదర్శిపై ఏపీ ప్రభుత్వం మరోమారు కక్ష సాధింపు చర్యలు.. కోర్టు ఆదేశాలు లెక్క చేయకుండా

శ్రీకాకుళం మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయంలో...సీఐడీ అధికారులు... రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. బ్రాంచ్ మేనేజర్ తో పాటు ఇతర సిబ్బంది నుంచి సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. ఎంపిక చేసిన చందాదారులకు... అధికారులు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. వారిని మార్గదర్శి కార్యాలయానికి రమ్మని ఒత్తిడి చేస్తున్నారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 5 మార్గదర్శి కార్యాలయాల్లో రెండోరోజూ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ అధికారులతో పాటు చిట్ రిజిస్ట్రార్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్, మున్సిపల్, కార్మిక శాఖలకు చెందిన అధికారులు వీరిలో ఉన్నారు. గుంటూరులోని అరండల్ పేట, మార్కెట్ సెంటర్, నరసరావుపేట, చీరాల, తెనాలి మార్గదర్శి శాఖల్లో ఉదయం 10గంటల నుంచి తనిఖీలు మొదలయ్యాయి. అన్నిచోట్లా పోలీసులను కాపలాగా ఉంచి తనిఖీలు చేస్తున్నారు. మొదటిరోజు కొన్నిచోట్ల మార్గదర్శి కార్యాలయాల తలుపులు వేసి తనిఖీలు చేసిన అధికారులు... రెండో రోజు మాత్రం షట్టర్లు తెరిచే ఉంచారు. మార్గదర్శి సిబ్బంది ఫోన్ల వినియోగంపై కొన్నిచోట్ల ఆంక్షలు విధించారు. ఒక్కో చోట 8నుంచి 12మంది వరకూ అధికారులతో కూడిన బృందాలు సోదాలు చేస్తున్నాయి.

AP CID Raids in Margadarsi Branches కోర్టు ఆదేశాలు బేఖాతరు.. మార్గదర్శిపై మళ్లీ దాడులు.. మూసివేత లక్ష్యంగా చర్యలు..

చిత్తూరు, తిరుపతి మార్గదర్శి కార్యాలయాల్లోరెండో రోజు సీఐడీ, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. కార్యాలయం లోపలికి వస్తున్న చందాదారులు, ఇతరుల వివరాలను... ప్రవేశ ద్వారం వద్ద ఉన్న పోలీసులు సేకరించాకే అనుమతిస్తున్నారు. కార్యాలయ సిబ్బంది నుంచి సెల్‍ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చిట్‍ డబ్బులు చెల్లించేందుకు కార్యాలయాలకు వస్తున్న కస్టమర్లను... సీఐడీ అధికారులు విచారిస్తున్నారు.

తణుకు మార్గదర్శి శాఖలోవిజిలెన్స్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. భీమవరంలో 50 లక్షల చిట్ లకు సంబంధించి... ఖాతాదారుల వివరాలు తెలుసుకుని సంబంధిత ఏజెంట్లను కార్యాలయానికి పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఏలూరు మార్గదర్శి బ్రాంచిలో మొత్తం నాలుగు శాఖల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే పాడుకున్న మూడు చిట్ గ్రూపులకు చెందిన సభ్యుల వివరాలు తీసుకుని... వారికి ఫోన్లు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

విజయనగరం మార్గదర్శి బ్రాంచిలోవిజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల బృందం సోదాలు రెండోరోజు కొనసాగుతున్నాయి. మార్గదర్శి కార్యాలయంలోనే రాత్రి బస చేసిన సీఐడీ డీఎస్పీ భూపాల్... ఉదయం పదిన్నర గంటల నుంచి సోదాల్లో పాల్గొన్నారు. చిట్ రిజిస్ట్రార్ కీర్తిప్రియ, జీఎస్టీ అధికారులు కార్యాలయానికి వచ్చి... చిట్ మొత్తాలు, ఖాతాదారులకు చెల్లింపులకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించారు. చెల్లింపులో సందేహం ఉన్న వాటికి సంబంధించి ఫోన్ చేసి ఖాతాదారులతో మాట్లాడారు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోమార్గదర్శి బ్రాంచ్​ల్లో రెండో రోజూ సీఐడీ (CID), వివిధ ప్రభుత్వ శాఖలు సోదాలు నిర్వహించాయి. రాజమహేంద్రవరం, సామర్లకోట, కాకినాడ, అమలాపురం, మండపేట బ్రాంచ్ ల్లో సీఐడీ, రెవెన్యూ అధికారులు ఉదయం నుంచే సోదాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరంలో 13 మంది ప్రభుత్వ సిబ్బంది... మార్గదర్శి కార్యాలయానికి వెళ్లి... సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఖాతాదారుల ఫోన్ నెంబర్లు, చిరునామా, పాన్ నెంబర్ల వివరాలు సేకరించారు. ఖాతాదారులకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేశారు. కాకినాడ చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి రికార్డులు రాజమహేంద్రవరం మార్గదర్శి బ్రాంచ్ కు తీసుకొచ్చి పరిశీలిస్తున్నారు. కాకినాడ మార్గదర్శి కార్యాలయంలో చిట్స్ వేసిన ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నారు. వారికి ఫోన్ చేసి చిట్స్ వివరాలు అడుగుతున్నారు. నగదు చెల్లించేందుకు వచ్చిన ఖాతాదారుల సెల్ ఫోన్ తీసుకొని కార్యాలయంలోనికి పంపిస్తున్నారు. మండపేట, అమలాపురం, సామర్లకోట బ్రాంచ్ ల్లోనూ అధికారులు రెండో రోజూ చిట్స్ రికార్డులు పరిశీలిస్తున్నారు. నగదు చెల్లింపు కోసం వచ్చిన ఖాతాదారులకు వివిధ ప్రశ్నలు సంధించారు. అలాగే అధిక మొత్తంలో చిట్స్ వేసిన ఖాతాదారుల వివరాలు సేకరించారు. అమలాపురంలో ఖాతాదారుల్ని పిలిచి చిట్స్ వివరాలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. సామర్లకోట బ్రాంచ్ లోనూ సీఐడీ, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చిట్స్ రికార్డులు పరిశీలిస్తున్నారు.

Margadarsi: మార్గదర్శిపై ప్రతీకారాత్మక దాడి.. ఏపీ సీఐడీ ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించిన సంస్థ

Last Updated : Aug 18, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details