attack on Sarpanch Kashmir: కశ్మీర్లో మరో సర్పంచ్‌పై దాడి జరిగింది. హల్కా అరిహాల్-బీ పంచాయతీకి చెందిన గులాం నబీ కుమార్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే, ముష్కరుల గురి తప్పడం వల్ల సర్పంచ్ నబీ ప్రాణాలతో బయటపడ్డారు. బాధితుడు స్వతంత్ర అభ్యర్థి అని అధికారులు తెలిపారు.
Kashmir Terrorist attacks
సర్పంచ్‌లపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ స్పందించారు. ఉగ్రవాదుల ముప్పు ఎదుర్కొంటున్న సర్పంచ్‌లు, పంచ్‌లకు భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీనగర్ సహా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో సురక్షిత వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 'కుల్గాంలో శుక్రవారం మరణించిన సర్పంచ్‌కు కూడా మేం అవసరమైన భద్రత కల్పించాం. అయితే, ఆయన సమాచారం ఇవ్వకుండా దక్షిణ కశ్మీర్‌కు వెళ్లారు' అని ఐజీ వివరించారు. జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లపైనా వివరాలు తెలియజేశారు విజయ్ కుమార్. పాకిస్థాన్‌కు చెందిన ముష్కర కమాండర్ ఖాలిద్ భాయ్, అతడి అనుచరుడు యాకిబ్ ముస్తాక్ మరణించినట్లు వెల్లడించారు.
గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు సర్పంచ్‌లపై దాడి జరిగింది. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:ల్యాండింగ్‌లో అపశృతి.. రన్‌వే పైనుంచి పక్కకు జరిగిన విమానం