తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒవైసీపై దాడి కేసు నిందితులకు యూపీ మంత్రి అండ!

Attack on Owaisi UP minister: అసదుద్దీన్ ఒవైసీ కారుపై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి కుటుంబ సభ్యులను యూపీ మంత్రి సునీల్ భరద్వాజ్ పరామర్శించారు. నిందితులు అమాయకులంటూ వెనకేసుకొచ్చారు.

sunil bhardwaj owaisi car attack
సునీల్ భరద్వాజ్

By

Published : Feb 16, 2022, 3:56 PM IST

Attack on Owaisi UP minister: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన నిందితుడి కుటుంబ సభ్యులను ఉత్తర్​ప్రదేశ్ కార్మిక సంక్షేమ శాఖ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి సునీల్ భరద్వాజ్ భరాలా పరామర్శించారు. గౌతమ్​బుద్ధ నగర్​లోని బాదల్​పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న భారాలా గ్రామానికి వెళ్లిన ఆయన.. నిందితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం నోయిడాలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. దాడి చేసిన వారిద్దరూ అమాయకులని పేర్కొనడం గమనార్హం.

Sunil Bhardwaj meet accused of owaisi attack

మంత్రి సునీల్ భరద్వాజ్

"బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఈ ఇద్దరు అమాయకులను ఒవైసీ కేసులో ఇరికించారు. సచిన్​, శుభం సహా వారి కుటుంబ సభ్యులకు మేం అండగా ఉంటాం. యువకులను ఇరికించి వారు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు."

-సునీల్ భరద్వాజ్ భరాలా, యూపీ మంత్రి

నిందితులకు అన్యాయం జరగకుండా చూస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సచిన్​ను జైలుకు ఎందుకు పంపించారనేది విచారణలో తేలుతుందని అన్నారు.

ఒవైసీపై దాడి

Owaisi car attacked: ఫిబ్రవరి 3న ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికల ప్రచారం ముగించుకొని దిల్లీకి తిరిగివస్తుండగా.. ఒవైసీ కారుపై దుండగులు కాల్పులు జరిపారు. ఛాజర్సీ టోల్​గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. కాల్పుల వీడియో కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఘటన నేపథ్యంలో ఒవైసీకి జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, ఆ నిర్ణయాన్ని ఒవైసీ తిరస్కరించారు. తాను స్వేచ్ఛగా బతకాలని అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:కేంద్రమంత్రి కాన్వాయ్​ పై దాడి- ఎస్పీపై భాజపా ఆరోపణలు

ABOUT THE AUTHOR

...view details