బంగాల్ మంత్రి జాకీర్ హుస్సేన్‌పై బాంబు దాడిపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ పార్టీలో చేరవలసిందిగా హుస్సేన్ని ఒత్తిడి చేశారని పరోక్షంగా భాజపాను విమర్శించారు. ఆ కుట్రలో భాగంగానే మంత్రిపై బాంబు దాడి జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎస్ఎస్కేఎమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రిని మమతా పరామర్శించారు.
"బాంబు దాడి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. రైల్వేస్టేషన్ ఈ దాడికి బాధ్యత వహించదని చెప్పడం ఏంటి? రైల్వే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నట్లు. రైల్వే శాఖ కేంద్రం పరిధిలోనిది. మా(రాష్ట్ర) పరిధిలో లేదు. ఈ కేసు సీఐడీతో పాటు రాష్ట్ర తిరుగుబాటు వ్యతిరేక దళం( ఎస్టీఎఫ్) కూడా దర్యాప్తు చేస్తుంది."
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
రాష్ట్రంలో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని భాజపా ఆరోపించింది. బాంబు దాడికి సంబంధించి రైల్వేశాఖను మమత నిందించడాన్ని తప్పుబట్టింది.