Attack on AP Ayyappa Devotees in Srirangam Temple :తమిళనాడులోని తిరుచ్చి జిల్లా శ్రీరంగం శ్రీరంగనాథ ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయ్యప్ప భక్తులకు, ఆలయంలోని తాత్కాలికంగా నియమితులైన సిబ్బంది మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో తొక్కిసలాట జరిగింది. సిబ్బంది దాడిలో ఆంధ్రా అయ్యప్ప మాలదారి చెన్నారావుతో సహా పలువురు గాయపడ్డారు.
శ్రీరంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షునిగా శ్రీధర్ రెడ్డి ప్రమాణస్వీకారం
AP Ayyappa Swamulapai Dadi In Trichy :దాడికి గురైన అయ్యప్ప భక్తులను చికిత్స నిమిత్తం శ్రీరంగం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆలయంలో ఉన్న పోలీసులు దాడికి దిగిన ఆలయ సిబ్బందికి మద్దతుగా నిలిచి తమను ఆలయం నుంచి బయటకు పంపారని బాధితులు ఆరోపించారు. పోలీసులు దాడిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారని కార్తీక గోపురం, ధ్వజస్తంభం తదితర ప్రాంతాల్లో వంద మందికి పైగా అయ్యప్ప భక్తులు నిరసన తెలిపారు. ఆందోళన చేస్తున్న అయ్యప్ప భక్తులను పోలీసులు అడ్డుకున్నారు. ఆలయ ప్రాంగణం అంతా పోలీస్ డౌన్ డౌన్ అనే నినాదాలతో మారుమోగింది. ఈ ఘటనతో శ్రీరంగం రంగనాథుని ఆలయంలో అలజడి నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ భక్తుల్లో కలకలం రేపుతోంది. తమపై దాడి చేసిన తాత్కాలిక ఉద్యోగులు సెల్వం, విఘ్నేష్, భరత్‌లపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.