తెలంగాణ

telangana

ETV Bharat / bharat

B Tech student die: దారుణం.. తరగతి గదిలోనే అబార్షన్‌ కారణంగా విద్యార్థిని మృతి - terrible incident in Nellore district

terrible incident in Nellore district: అబార్షన్‌ కారణంగా తరగతి గదిలోనే ఓ విద్యార్థినిని మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కళాశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. గర్భాన్ని తొలగించుకునే ప్రయత్నంలోనే.. విద్యార్థిని మృతి చెందినట్లు, ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

తరగతి గదిలోనే అబార్షన్‌ కారణంగా విద్యార్థినిని మృతి
తరగతి గదిలోనే అబార్షన్‌ కారణంగా విద్యార్థినిని మృతి

By

Published : Apr 15, 2023, 10:22 AM IST

Updated : Apr 15, 2023, 10:30 AM IST

terrible incident in Nellore district: నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. అబార్షన్‌ కారణంగా ఓ విద్యార్థిని తరగతి గదిలోనే మృతి చెందింది. కళాశాల యాజమాన్యం సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా ప్రచారం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు సంబంధిత యువకుడిని స్టేషన్‌కి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలానికి చెందిన ఓ యువతి (19) నెల్లూరు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ కళాశాలలో బీటెక్‌ రెండవ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 11వ తేదీన కళాశాలలో విద్యార్థులందరూ ప్రాంగణంలో ఉండగా.. విద్యార్థిని ఒక్కరే తరగతి గదిలో ఉండిపోయింది. లోపలికి ఎవరు రాకుండా గది తలుపులకు గడియ పెట్టుకుంది. పలువురు విద్యార్థినిలు ఎంతకొట్టిన తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చి యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో తరగతి గది తలుపులను విరగగొట్టి చూడగా.. అందరూ షాక్‌కు గురయ్యారు. యువతి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలో పడి ఉండగా.. పక్కనే ఆరు నెలల పిండం కూడా ఉంది.

అప్రమత్తమైన మిగతా విద్యార్థులు హుటాహుటిన తల్లిని (విద్యార్థినిని), ఆరు నెలల పిండాన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే తల్లి మృతి చెందినట్లు తెలిపారు. కళాశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారం అందుకున్న నెల్లూరు గ్రామీణ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, వివరాలను సేకరించారు. అనంతరం యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. జరిగిన ఘటనపై పోలీసులు.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా.. అనంతసాగరానికి చెందిన ఓ కారు డ్రైవరుతో పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం ఐదు రోజుల కిందట జరిగిన ఈ సంఘటన జిల్లాలో ప్రచారం కావడంతో గుట్టుచప్పుడు కాకుండా పోలీసులు సంబంధిత యువకుడిని స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. కారు డ్రైవర్‌తో విద్యార్థినిని కొంతకాలంగా ప్రేమ సంబంధం కొనసాగించిందని.. ఆ క్రమంలోనే ఆమె గర్భం దాల్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గర్భం దాల్చిన విషయాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి.. ఐదు రోజులుగా గర్భాన్ని తొలగించే యత్నం చేసినట్లు భావిస్తున్నారు. ఆ యత్నంలో భాగంగానే తరగతి గదిలో మాత్రాలు వేసుకోవడంతో అవి వికటించి.. తీవ్ర రక్తస్రావం జరిగి, తరగతి గదిలోనే కోమాలోకి వెళ్లినట్టు గుర్తించారు. ముందుగా ప్రైవేట్ వైద్యశాలకు తరలించాగా.. విద్యార్థినిని పరిస్థితి అప్పటికే విషమించడంతో అక్కడి నుంచి నెల్లూరు జీజీహెచ్‌కి తరలించారు. కానీ, ఈ లోపే యువతి మృతి చెందింది. ఈ సంఘటనతో విద్యార్థిని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 15, 2023, 10:30 AM IST

ABOUT THE AUTHOR

...view details