తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దొంగతనానికి పోయి... ఏటీఎంలో ఇరుక్కుపోయాడు - నమక్కల్​లో ఏటీఎం చోరీ

ఓ వ్యక్తి దొంగతనం చేద్దామని అనుకున్నాడు. పక్కాగా ప్లాన్​ చేసుకున్నాడు. ఏటీఎంను తెరిచే ప్రయత్నం చేశాడు. అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుందని భ్రమపడ్డాడు. అక్కడే అతనికి ఊహించని అవాంతరం ఎదురైంది.

ATM Robbery attempt
బయటకు రావడానికి ప్రయత్నిస్తున్న ఉపేంద్ర

By

Published : Aug 7, 2021, 11:53 AM IST

దొంగతనానికి పోయి... ఏటీఎంలో ఇరుక్కుపోయాడు

తమిళనాడులోని నమక్కల్​ పోలీస్టేషన్​ పరిధిలోని అనియాపురంలో ఉండే ఏటీఎంలోని డబ్బును అపహరించడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి దాని వెనుక భాగంలో ఇరక్కుపోయాడు. ఈ వ్యక్తిని బిహార్​కు చెందిన వలస కూలీ ఉపేంద్రరాయ్​గా పోలీసులు గుర్తించారు.

ఏటీఎం పై భాగంలో ఇరుక్కుపోయిన ఉపేంద్రరాయ్​
ఏటీఎం వెనుకభాగం నుంచి బయటకు వస్తూ..

ఇదీ జరిగింది..

ఉపేంద్ర రాయ్​ అనే యువకుడు స్థానికంగా ఉండే పౌల్ట్రీ ఫీడ్ ఫ్యాక్టరీలో ప్యాకర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అక్కడ ఉన్న ఏటీఎంలోని డబ్బును చోరీ చేయాలని అనుకున్నాడు. తెల్లవారుజామున ఏటీఎంను తెరిచేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడ ఉండే అలారం మోగింది. దీంతో దొంగ ఏటీఎంకు వెనుక భాగంలో నక్కేందుకు చూసి అందులో ఇరుక్కుపోయాడు. ఈ సమయంలో అతను చేస్తున్న శబ్దాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అసలు విషయం బయటపడింది. ఏటీఎం పై భాగంలో ఉపేంద్ర ఇరుక్కునిపోయి ఉండడం గమనించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

బయటకు రావడానికి ప్రయత్నిస్తూ..

ఇదీ జరిగింది:సినిమా సీన్​ను తలపించిన యాక్సిడెంట్​- 22 మంది సేఫ్​

ABOUT THE AUTHOR

...view details