Nagpur ATM Extra Cash: ఏటీఎంలో 5 వందల రూపాయలు కావాలని ఎంటర్ చేస్తే అంతకు అయిదు రెట్లు ఎక్కువ డబ్బు వచ్చిన ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో జరిగింది. నాగ్‌పుర్ పట్టణంలోని ఖాపర్‌ఖేడా ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమాచారం నాగ్‌పుర్ అంతా వ్యాపించగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఏటీఎంకు వరుస కట్టారు. అయితే ఓ బ్యాంకు ఖాతాదారుడు పోలీసులకు సమాచారం అందించగా.. వారు బ్యాంకు సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాంకు సిబ్బంది అక్కడికి చేరుకుని ఏటీఎంను మూసివేశారు. సాంకేతిక లోపం వల్లే ఈ తప్పిదం జరిగిందని బ్యాంకు సిబ్బంది వివరణ ఇచ్చారు.
రూ.100 నోట్లు ఉంచాల్సిన ఏటీఎం ట్రేలో.. రూ.500 నోట్లు ఉంచడం వల్లే పొరపాటు జరిగిందని ఓ అధికారి వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు చెప్పారు.
రూ.500 కొడితే 2500.. ఆ ఏటీఎంకు ఎగబడ్డ జనం! - మహారాష్ట్ర ఏటీఎం న్యూస్
మీకు ఏటీఎంలో ఎప్పుడైనా ఎంటర్ చేసిన అమౌంట్ కంటే.. ఎక్కువ డబ్బులు వచ్చాయా? అలా జరిగి ఉండదులే. కానీ ఓ వ్యక్తి రూ. 500 తీసుకుందామని వెళ్తే.. 2500 రూపాయలు వచ్చాయి. అంటే 5 రెట్లు అధికంగా డబ్బు పొందాడు. అంతే.. ఆ ఏటీఎంకు వందలాదిగా క్యూ కట్టారు జనం. ఇది ఎక్కడ జరిగిందంటే?
ATM dispenses 5 times extra cash in Maha; people rush to withdraw money