Umesh Pal Kidnapping Case : ఉమేశ్‌పాల్ అపహరణ కేసులో ఉత్తర్‌ప్రదేశ్ గ్యాంగ్‌స్టర్, రాజకీయ నేత అతిఖ్ అహ్మద్‌ను ప్రజాప్రతినిధుల కోర్టు దోషిగా తేల్చింది. 2006లో ఉమేశ్‌పాల్ అపహరణ కేసుకు సంబంధించి అతిఖ్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. అహ్మద్ సోదరుడు ఖలీద్ అజిమ్, మరో ఆరుగురిని ఈ కేసులో నిర్దోషులుగా తేల్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉమేశ్‌ను.. కొందరు దుండగులు కాల్చిచంపారు. ఈ కేసులో అహ్మద్ అతిఖ్ సహా ముగ్గురిని ప్రయాగ్‌రాజ్ కోర్టు దోషులుగా తేల్చి శిక్ష విధించింది. మరో కేసులో నిందితుడిగా ఉన్న అహ్మద్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉంచగా.. కట్టుదిట్టమైన భద్రత మధ్య సోమవారం ప్రయాగ్‌రాజ్‌కు తరలించారు.
సుప్రీం కోర్టులో చుక్కెదురు..
మరోవైపు సుప్రీంకోర్టులోనూ అతిఖ్ అహ్మద్‌కు చుక్కెదురైంది. ప్రస్తుతం యూపీ పోలీసుల కస్టడీలో ఉన్న తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని కోరుతూ అతిఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బెలా ఎం. త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించవచ్చని అతిఖ్ అహ్మద్‌కు సూచించింది. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను తన పిటిషన్లో ప్రస్తావించాడు. రాష్ట్రంలో మాఫీయాను మట్టిలో కలిపేస్తా(మాఫీయాకో మిట్టి మే మిలా దేంగే) అనే వ్యాఖ్యలు తనన ఉద్దేశించి చేసినవేనంటూ.. తనకు రక్షణ కల్పించాలని కోర్టును కోరాడు.