దేశంలో కొత్తగా 1,73,790 మంది (corona cases in India) వైరస్ బారిన పడ్డారు. మరో 3,617 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 2,84,601 మంది కొవిడ్((covid-19) నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 90.80 శాతానికి పెరిగింది.
- మొత్తం కేసులు: 2,77, 29, 247
- మొత్తం మరణాలు: 3,22,512
- కోలుకున్నవారు: 2,51,78,011
- యాక్టివ్ కేసులు: 22,28,724
34.11 కోట్ల పరీక్షలు..
దేశవ్యాప్తంగా శుక్రవారం 20,80,048 నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 34,11,19,909 కు చేరింది.
ఇదీ చదవండి :'టీకాలు ముందే కొనాల్సింది.. 200 కోట్ల డోసులు అసాధ్యం'