విశ్వాంతరాళంలో శక్తిమంతమైన సూపర్ నోవా కాంతిని కనుగొన్నట్లు భారత శాస్త్ర, సాంకేతిక విభాగం డీఎస్‌టీ ప్రకటించింది. విశ్వం పుట్టుకను అధ్యయనం చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది.
విశ్వంలో అరుదైన సూపర్నోవా - కొత్త రకం విస్ఫోటం
విశ్వంలో చాలా ప్రకాశవంతమైన, వేగంగా మార్పు చెందుతున్న ఒక సూపర్నోవాను భారత శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఇది పూర్తిగా స్వయం ప్రకాశితం కాదని తేల్చారు.
సూర్యుడి కంటే 25 రెట్లు అధికంగా బరువు ఉండి హైడ్రోజన్ లోపించిన నక్షత్రాల్లో జరిగే శక్తిమంతమైన విస్ఫోటం వల్ల ఈ సోపర్ నోవా కాంతి ఉద్భవిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కాంతి అత్యంత ప్రకాశవంతంగా నీలి వర్ణంలో ఉందని వివరించారు. ఈ సూపర్ నోవా కాంతిని అంతరిక్ష వస్తువులను పరిశీలించే శక్తిమంతమైన దేవ్ స్థల్, సంపూర్ణ ఆనంద్ టెలిస్కోప్ ద్వారా గుర్తించినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. తాజా పరిశోధనల వల్ల ఇతర శక్తిమంతమైన గామా రే, రేడియో విస్ఫోటనాలను అధ్యయనం చేసేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:విశ్వంలో కొత్త రకం విస్ఫోటం