ఆదాయం- 14; వ్యయం-14: రాజపూజ్యం- 3; అవమానం- 6
శుభకృత్ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చాలావరకూ సమానంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. గురుగ్రహం ద్వాదశంలో ఉన్నందువల్ల శుభకార్యాలకు ఖర్చవుతుంది. స్థానచలనం గోచరిస్తోంది. సుఖసంతోషాలున్నాయి. మనశ్శాంతి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యం పెరుగుతుంది. అధికార యోగముంది. రాహుకేతువుల సంచారం వల్ల శ్రమ పెరిగినా సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. విద్యార్థులు ఎక్కువగా కృషి చేస్తేనే రాణించగలరు. వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం ధనరూపంలో లభిస్తుంది. కుటుంబసభ్యులతో విభేదాలు రానీయొద్దు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపండి. ఇష్టంగా చేసే పనిలో అధిక లాభముంటుంది. తెలియని సమస్యలు ఎదురైనా సమష్టి కృషితో పరిష్కారాన్ని వెతకాలి. ఉత్సాహం తగ్గకూడదు. పరిస్థితులను అర్థం చేసుకుంటూ తగు విధంగా ప్రవర్తించండి. ఒత్తిడి లేకుండా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులొస్తాయి. బంధు మిత్రులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. ఓర్పు చాలా అవసరం. శాంత చిత్తంతో ముందుకు సాగండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. గురు శని రాహు కేతు శ్లోకాలు చదువుకోవాలి.
ఆదాయం 8; వ్యయం 8; రాజపూజ్యం 6; అవమానం 6
ఈ ఏడాది ఏకాదశంలో గురుబలం విశేషమైన అదృష్టాన్నీ శారీరకశక్తినీ పేరు ప్రతిష్ఠలనూ ప్రసాదిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. దైవానుగ్రహం ఉంది. కోరికలు సిద్ధిస్తాయి. భూ గృహ వాహనాది శుభయోగాలు ఫలిస్తాయి. కేతువు ఆరవ రాశిలో ధైర్యాన్నీ సమయస్ఫూర్తినీ కార్యనిర్వహణ సామర్థ్యాన్నీ ఇస్తాడు. ఉద్యోగపరంగా శ్రమకు తగిన గుర్తింపు తెచ్చుకుంటారు. దశమంలో శనివల్ల మానసిక ఒత్తిడి కలుగుతుంది. 12లో రాహువు వల్ల తెలియని ఖర్చులూ ఇబ్బందులూ ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులూ గోచరిస్తున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. విద్యార్థులకు ఉత్తమ విద్య లభిస్తుంది. శని, రాహు శ్లోకాలు చదువుకోవాలి. రుద్రాభిషేకం శుభాన్నిస్తుంది.
ఆదాయం- 11; వ్యయం- 5; రాజపూజ్యం- 2; అవమానం- 2
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఏకాదశంలో రాహుబలం కార్యసిద్ధినీ గౌరవాన్నీ ప్రసాదిస్తుంది. జీవితాశయాలు నెరవేరతాయి. గురు, శని, కేతు దోషాలవల్ల అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. తెలివిగా పనుల్ని పూర్తిచేయాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగంలో శాంతం అవసరం. వ్యాపారం కలిసివస్తుంది. విద్యార్థులకు పరీక్షాకాలంగా అనిపిస్తుంది. విదేశయోగాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంపై దృష్టి నిలపాలి. వృథా ప్రయాణాలను తగ్గించుకోవాలి. బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించండి. సంతృప్తికరమైన ఫలితాలను సాధిస్తారు. గురు, శని, కేతు శ్లోకాలు చదువుకోవాలి.
ఆదాయం- 5; వ్యయం- 5; రాజపూజ్యం- 5; అవమానం- 2
సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంతృప్తికరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఆశయాలు నెరవేరతాయి. ఆపదల నుంచి బయటపడతారు. భాగ్య గురు, రాజ్య రాహువుల వల్ల విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. వ్యాపారం కలిసివస్తుంది. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహలాభం సూచితం. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఆనందంగా ఉంటారు. ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రశంసా పురస్కారాలు అందుతాయి. ఎదురుచూస్తున్న విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు సిద్ధిస్తాయి. శని, కేతువుల వల్ల మధ్యమధ్యలో ఆటంకాలు ఎదురవుతాయి. ధైర్యంగా ఉండాలి. విద్యార్థులకు విశేషమైన సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుంది. శని, కేతు శ్లోకాలు చదువుకోవాలి.
ఆదాయం- 8; వ్యయం- 14; రాజపూజ్యం- 1; అవమానం- 5
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంయమనాన్ని పాటిస్తే అవమానాల్ని తప్పించుకోవచ్చు. తృతీయ కేతు ప్రభావం వల్ల సౌభాగ్యసిద్ధి కలుగుతుంది. ఆర్థికస్థితి క్రమంగా మెరుగవుతుంది. సాహస నిర్ణయాలు విజయాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో ముందుకుసాగాలి. ఆరవ రాశిలో శనివల్ల ఉద్యోగంలో కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. సంకల్పసిద్ధి కలుగుతుంది. మధ్యమధ్యలో గురు, రాహు గ్రహాల వల్ల స్వల్పంగా సమస్యలు రావచ్చు. కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెంచాలి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులూ రావు. బంగారు భవిష్యత్తు సూచితం. గురు, రాహు శ్లోకాలను చదువుకోవాలి.
ఆదాయం- 11 వ్యయం- 5 రాజపూజ్యం- 4 అవమానం- 5
ఈ ఏడాది విశేషమైన ఆదాయముంటుంది. చర, స్థిరాస్తులను వృద్ధిచేసే సమయం. సప్తమంలో గురుబలం విశేషమైన శుభాన్ని ప్రసాదిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు విజయవంతమవుతాయి. త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. ఉద్యోగంలో విశేష ప్రతిభను కనబరుస్తారు. రాజానుగ్రహ సిద్ధి కలుగుతుంది. శని, రాహు, కేతువుల వల్ల అప్పుడప్పుడూ తెలియని ఆటంకాలెదురవుతాయి. ధైర్యాన్ని కోల్పోవద్దు. ముక్కుసూటిగా వ్యవహరించవద్దు. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలుంటాయి. సమాజంలో పేరు ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ప్రముఖ వ్యక్తుల సహకారం లభిస్తుంది. పలు మార్గాల్లో విజేతలుగా నిలుస్తారు. విద్యార్థులకు బ్రహ్మాండమైన ధారణాశక్తి ఉంటుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. అలసత్వం లేకుండా లక్ష్యాలను పూర్తి చేయండి. శని, కేతు గ్రహ శ్లోకాలు చదువుకోవాలి.