తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​లో ఆక్స్​ఫర్డ్​ టీకా ట్రయల్స్​పై సీరం క్లారిటీ - ఆక్స్​ఫర్డ్​ టీకా

భారత్​లో నిర్వహిస్తున్న ఆక్స్​ఫర్డ్​ టీకా ట్రయల్స్​ సజావుగా సాగుతున్నట్టు సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా వెల్లడించింది. టీకా సురక్షితమైనని, సహనంతో ఉండాలని పేర్కొంది.

astrazeneca-oxford-vaccine-safe-indian-trials-progressing-smoothly-serum-institute
భారత్​లో ఆక్స్​ఫర్డ్​ టీకా ట్రయల్స్​పై సీరం క్లారిటీ

By

Published : Nov 26, 2020, 10:03 PM IST

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న కరోనా టీకా సురక్షితం, ప్రభావవంతమైనదని సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా(ఎస్​ఐఐ) వెల్లడించింది. భారత్​లో.. అన్ని నిబంధనలను అనుసరిస్తూ టీకా ట్రయల్స్​ సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేసింది.

తాము అభివృద్ధి చేసిన కరోనా టీకా తయారీలో తప్పు జరిగిందని ఆక్స్​ఫర్డ్-ఆస్ట్రాజెనికా ప్రకటించిన గంటల వ్యవధిలో సీరం ఈ ప్రకటన చేసింది.

"ఆస్ట్రాజెనెకా- ఆక్స్​ఫర్డ్​ టీకా సురక్షితమైనది. ఉన్న ఫలితాలే 60-70శాతం ప్రభావవంతమని చెబుతున్నాయి. దీంతో కరోనాను అరికట్టేందుకు టీకా ఉపయోగపడుతుందని అర్థమవుతోంది. ఈ సమయంలోనే గందరగోళానికి లోనుకాకుండా.. సహనంతో ఉండాలి."

--- సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా.

అక్స్​ఫర్డ్​- ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న టీకాను భారత్​లో పంపిణీ చేసేందుకు వాటితో ఒప్పందం కుదుర్చుకుంది సీరం.

ఇదీ చూడండి:-టీకాపై శనివారం మోదీ కీలక ప్రకటన!

ABOUT THE AUTHOR

...view details