టీకాల కొరత వేధిస్తున్న వేళ.. యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. వ్యాక్సిన్ డోసుల మధ్య వ్యవధి ఎంత ఎక్కువుంటే.. ఫలితం అంతా బాగా ఉంటుందని తెలిపింది. రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని వెల్లడించింది.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్(భారత్లో కొవిషీల్డ్) డోసుల మధ్య వ్యవధిని 45 వారాలకు(దాదాపు 11 నెలలు) పెంచడం వల్ల మరింత బలమైన రోగనిరోధకత ఏర్పడినట్లు పరిశోధకులు నిర్ధరించారు. 18-55 ఏళ్ల మధ్య వలంటీర్లపై ట్రయల్స్ చేసి ఈ విషయాన్ని తేల్చారు.
అయితే.. కొవిషీల్డ్ తొలి డోసుతో వచ్చిన యాంటీబాడీలు సంవత్సరం పాటు ఉంటాయా అనే దానిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆక్స్ఫర్డ్ పరిశోధకులు తెలిపారు.
ఆపై 6 నెలలకు బూస్టర్ డోసు..