ఈ విశ్వం మొత్తానికి 'నేనే రాజు.. నేనే మంత్రి' అని భావిస్తాడు మనిషి. తన మనుగడ కోసం ఎంత దూరమైనా వెళతాడు, ఎవరినైనా ఎదురిస్తాడు. కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు వచ్చింది ఈ ఆలోచనలతోనే.
కానీ అదే మనిషి.. తన చర్యలతో మొత్తం ప్రపంచానికే ప్రమాదం తెచ్చిపెడుతున్నాడు. మనిషి తప్పిదాల వల్ల ప్రకృతికి పెను ముప్పు ఎదురవుతోంది. అడవులు కార్చిచ్చుతో దగ్ధమవుతుంటే.. నదులు, సముద్రాలు కలుషితమవుతున్నాయి. ఇవన్నీ మనిషితో సమానమైన కోటానుకోట్ల జీవరాశులపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా జంతువులు అంతరించిపోయాయి కూడా!