తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన భాజపా.. పంజాబ్​లో ఊడ్చేసిన ఆప్​ - undefined

Assembly seats state wise: సార్వత్రికానికి సెమీఫైనల్స్‌గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా అద్భుత ఫలితాలు రాబట్టింది. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలదన్నేలా నాలుగు రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకుంది. అత్యంత కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి అఖండ విజయాన్ని అందుకుంది. దేవభూమి ఉత్తరాఖండ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన కమలదళం మణిపూర్‌లోనూ అధికారం నిలబెట్టుకుంది. గోవాలో స్వతంత్రులతో కలిసి మళ్లీ పాగా వేయనుంది. కమలమంటే ఫ్లవర్‌ కాదు ఫైర్ అంటూ ఢంకా బజాయించింది. మరోవైపు దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ జాతీయ పార్టీగా అవతరించే దిశలో అద్భుతమైన ముందడుగు వేసింది. పంజాబ్‌లో జయభేరి మోగించి ఆప్‌ అంటే చీపురు కాదు చిచ్చరపిడుగు అని యావత్‌ భారతావనికి చాటిచెప్పింది.

assembly seats
నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటిన భాజపా

By

Published : Mar 10, 2022, 9:18 PM IST

Assembly seats state wise: అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ విజయాన్ని సాధించింది. గురువారం వెలువడిన ఫలితాల్లో ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలకు మించి.. మోదీ-షా జోడీ బ్లాక్​ బస్టర్​ హిట్​ కొట్టింది. 2024లో జరగనున్న సార్వత్రిక పోరుకు సెమీఫైనల్​గా భావించిన ఈ ఎన్నికల్లో.. ఆమ్​ ఆద్మీ పార్టీ పంజాబ్​లో ఏకపక్ష విజయం సాధించగా.. యూపీ సహా ఉత్తరాఖండ్​, గోవా మణిపుర్​లో భాజపా తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. అయితే కాంగ్రెస్​ మాత్రం తన ఓటమి పరంపరను కొనసాగించింది. యూపీలో రెండు సీట్లను రాబట్టకోవడానికే ఆపసోపాలు పడింది. పంజాబ్​లో అధికారాన్ని కోల్పోయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రాష్ట్రాల్లో( రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​ )నే అధికారానికి పరిమితమైంది.

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల ఫలితాలు..

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కమలం వికసించింది. వరుసగా రెండోసారి ఆ రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది. యూపీలో అధికారాన్ని నిలబెట్టుకున్న భాజపా కూటమి మూడింట రెండొంతుల సీట్లకుపైగా సొంతం చేసుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో సాధారణ మెజార్టీకి 202 స్థానాలు అవసరంకాగా భాజపా కూటమి 273 సీట్లను కైవసం చేసుకుని విజయదుందుభి మోగించింది.

పార్టీ గెలుపు/ఆధిక్యం
భాజపా కూటమి 273
ఎస్​పీ కూటమి 125
బీఎస్​పీ 1
కాంగ్రెస్​ 2
ఇతరులు 2

పంజాబ్​ ఎన్నికల ఫలితాలు..

పంజాబ్​ రాజకీయాల్లో కొత్త పొద్దు పొడిచింది. దేశ రాజధానిలో వరుస విజయాలను నమోదు చేసుకున్న కేజ్రీవాల్​ పార్టీ.. మరోసారి 'చీపురు' సత్తా ఏంటో దేశానికి చాటి చెప్పింది. దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌.. పంజాబ్​లో కూడా అదే పరంపరను కొనసాగిస్తూ.. ప్రభంజనం సృష్టించింది.

పార్టీ గెలుపు/ఆధిక్యం
ఆప్​ 92
కాంగ్రెస్​ 18
ఎస్​ఏడీ కూటమి 4
భాజపా కూటమి 2
ఇతరులు 1

ఉత్తరాఖండ్​ ఎన్నికల ఫలితాలు...

దేవభూమిలో అధికార భాజపాకు ఉత్తరాఖండ్ ప్రజలు మరోసారి బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారే సంప్రదాయానికి స్వస్తిపలికి... రెండోసారి భాజపాకు అధికారాన్ని కట్టబెట్టారు. ఈ విజయంతో ఉత్తరాఖండ్ చరిత్రలో తొలిసారి వరుసగా రెండోసారి గెలిచిన రికార్డును భాజపా సొంతంచేసుకుంది. మరోవైపు ఈ ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, మాజీ సీఎం హరీశ్ రావత్ ఓటమి పాలయ్యారు.

పార్టీ గెలుపు/ఆధిక్యం
భాజపా 47
కాంగ్రెస్​ 19
ఆప్​ 0
ఇతరులు 4

మణిపుర్ ఎన్నికల ఫలితాలు...

మణిపూర్‌లో భాజపా తన అధికారాన్ని నిలబెట్టుకుంది. అన్ని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను నిజం చేస్తూ మణిపూర్‌ ప్రజలు మరోమారు భాజపాకే పట్టం పట్టారు. 32 స్థానాల్లో విజయం సాధించిన కమలం పార్టీ రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.

పార్టీ గెలుపు/ఆధిక్యం
భాజపా 32
కాంగ్రెస్​ కూటమి 5
ఎన్​సీపీ 7
జేడీయూ 6
ఇతరులు 10

గోవా ఎన్నికల ఫలితాలు...

గోవాలోనూ భాజపా మరోసారి అధికారం చేపట్టనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలకు ఒక సీటు దూరంలో నిలిచిన కమలదళం.. స్వతంత్రులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.

పార్టీ గెలుపు/ఆధిక్యం
భాజపా 20
కాంగ్రెస్​ కూటమి 12
తృణమూల్​ కూటమి 2
ఆప్​ 2
ఇతరులు 4

ఇవీ చూడండి:

రాజకీయం లెక్కలు మార్చిన మినీ సమరం- 2024లో ఏం జరగనుంది?

'జాతీయవాదం, సుపరిపాలనకే జైకొట్టిన జనం'

మోదీ తర్వాత బలమైన నేతగా యోగి? జాతీయ రాజకీయాల్లోకి?

పంజాబ్​లో నవోదయం- సా'మాన్'యుడిదే సీఎం పీఠం

ఎగ్జిట్ పోల్స్​ లెక్క ఎంత వరకు కరెక్ట్?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details