అసోం, బంగాల్ తొవి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బంగాల్లో పలు చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. ఆ రాష్ట్రంలో సాయంత్రం 6 గంటల వరకు 79.79 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో 72.14 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బంగాల్లో 80%, అసోంలో 72% పోలింగ్ - ఓటు వేసిన అసోం ముఖ్యమంత్రి
19:30 March 27
15:22 March 27
ఈసీని కలిసిన భాజపా నేతలు..
భాజపా నేత సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి కారుపై దాడి జరిగిన క్రమంలో ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు భాజపా నేతలు. ఆరేళ్లలో రిగ్గింగ్, హింస వంటి ఘటనలు జరిగిన తొలి ఎన్నికలు ఇవేనన్నారు. రెండో దశలో అలాంటివి కనీసం 10 శాతం కూడా ఉండకుండా చూడాలని కోరారు. సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేయాలని డిమాండ్ చేశారు భాజపా ప్రధాన కార్యదర్శి
15:13 March 27
బంగాల్లో 70 శాతం ఓటింగ్
రెండు రాష్ట్రాల్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు బంగాల్లో 70.17 శాతం, అసోంలో 62.09 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు. బంగాల్లో మొత్తం 73.80 లక్షల మంది, అసోంలో 81.09 మంది ఓటింగ్‌లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు.
14:27 March 27
భాజపా నేత సువేందు అధికారి తండ్రి సిసిర్ అధికారి కాంతిలో ఓటు వేశారు.
14:11 March 27
మధ్యాహ్నం 2 గంటల సమయానికి అసోంలో 45.24 శాతం, బంగాల్లో 54.90 శాతం ఓటింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
14:11 March 27
అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు రిపున్ బోరా గోహ్పూర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
13:55 March 27
కోల్‌కతాలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిశారు బంగాల్ టీఎంసీ నేతలు. పోలింగ్ బూత్ ఏజెంట్ల విషయంలో భాజపా నిబంధనలు ఉల్లంఘించిందని ఫిర్యాదు చేశారు.
13:48 March 27
మధ్యాహ్నం 1 వరకు బంగాల్లో 54.1 శాతం, అసోంలో 37.06 శాతం పోలింగ్ జరిగినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
12:19 March 27
ఓటు వేసిన నేతలు..
భాజపా బంగాల్ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఝార్గ్రామ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
12:18 March 27
అసోం ముఖ్యమంత్రి సర్భానంద సోనోవాల్ దిబ్రుగర్హ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. తమ పార్టీకి 100 కన్నా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్.. జోర్హత్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
11:28 March 27
ఈసీకి లేఖ..
ఓటింగ్ శాతంలో తేడాలు వస్తున్నాయని టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అనుమానాలు రేకెతున్నాయని ఆరోపించారు.
మరోవైపు... 11 గంటల వరకు అసోంలో 24.48 శాతం, బంగాల్లో 24.61 శాతం ఓటింగ్ జరిగిందని ఎన్నికల సంఘం పేర్కొంది.
09:29 March 27
తొలి దశ పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల తర్వాత అసోంలో 14.28 శాతం, బంగాల్లో 7.72 శాతం ఓటింగ్ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
08:41 March 27
మాస్కులు తప్పనిసరి..
అసోం లాహోవల్ నియోజకవర్గంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మాస్కులు, తాత్కాలికంగా ఉపయోగించే కవర్ గ్లోవ్స్ అందిస్తున్నారు అధికారులు. చేతులు శానిటైజ్ చేశాకే ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
08:25 March 27
భౌతిక దూరం పాటిస్తూ...
అసోం మజులిలోని పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటిస్తూ.. ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఓటర్లు. బకుల్, రుపాహి, నాగావ్ జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బంగాల్లోని పురులియా కేంద్రంలో కొవిడ్ దృష్ట్యా పలు జాగ్రత్తలు వహిస్తూ పోలింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు.
07:17 March 27
బంగాల్లోని పశ్చిమ మిద్నాపూర్, ఝార్గ్రామ్ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు.
07:03 March 27
పోలింగ్ ప్రారంభం
బంగాల్, అసోంలో.. తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు బార్లు కడుతున్నారు.
06:37 March 27
పోలింగ్ లైవ్ అప్డేట్స్
బంగాల్, అసోంలో.. తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. అసోంలో 47, బంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
అసోంలో మొత్తం 126 నియోజకవర్గాలు ఉండగా మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. 47 స్థానాలకు తొలివిడత ఓటింగ్ జరుగుతుండగా... అసోం సీఎం సోనోవాల్ మజులీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. శాసనసభ సభాపతి హితేంద్రనాథ్ గోస్వామి జోరాట్ నుంచి, పీసీసీ అధ్యక్షుడు రిపున్బోరా గోపూర్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.
బంగాల్లో 8 విడతల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో.. మొత్తం 191 మంది అభ్యర్ధులు అదృష్టం పరీక్షించుకోనున్నారు.