నేటి నుంచి అసోంలో కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టనుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందుకోసం పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాను రంగంలోకి దింపింది. మార్చి 1 నుంచి రెండు రోజుల పాటు ఆమె రాష్ట్రంలో ప్రచారం నిర్వహించనున్నారు.
వీలైనంత ఎక్కువగా ప్రియాంకతో ప్రచారం చేయించాలని పార్టీ నిర్ణయించింది. నేడు ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మార్చి 2న తేజ్పుర్లో ఓ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
అసోంతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఆమె ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే కేరళలో ప్రియాంక ప్రచారానికి సంబంధించిన తేదీలను పార్టీ రాష్ట్ర బాధ్యులకు అందించారు.