ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్దుల్లో 45శాతం మందికి నేర చరిత్ర ఉందని ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ (ఏడీఆర్) తెలిపింది. తమపై కేసులు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లలో వీరు పేర్కొన్నట్లు వెల్లడించింది.
5 రాష్ట్రాల్లోని మొత్తం 690 మంది విజేతల్లో 219 మంది తమపై తీవ్రమైన నేరపూరిత కేసులు ఉన్నట్లు ప్రకటించారని ఏడీఆర్ తెలిపింది. నేరచరిత్ర ఉన్నట్లు ప్రకటించిన 312 విజేతల్లో 134 మంది భాజపా, 71 మంది సమాజ్‌వాదీ పార్టీ, 52 మంది ఆమ్ ఆద్మీ పార్టీ, 24 మంది కాంగ్రెస్, ఏడుగురు ఆర్ఎల్డీ అభ్యర్థులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది.