తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొంపముంచిన రెబల్స్​.. బెడిసికొట్టిన బీజేపీ అమెరికా మోడల్.. కాంగ్రెస్​కూ నష్టం! - బసవరాజు బొమ్మై

Assembly Elections Result 2023 : కర్ణాటక అసెంబ్లీలో రెబల్​ అభ్యర్థులు కాంగ్రెస్​, బీజేపీ కొంపముంచారు. టికెట్​ ఆశించి భంగపడ్డ నాయకులు రెబల్స్​గా బరిలోకి దిగారు. ఈ కారణంగా ప్రత్యర్థి పార్టీలు లాభపడ్డాయి. కాంగ్రెస్​తో పోలిస్తే బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది. ఈసారి రెబల్స్​ ప్రభావం తీవ్రంగా పడిన స్థానాలివే..

assembly elections result 2023 rebel leaders
assembly elections result 2023 rebel leaders

By

Published : May 13, 2023, 8:50 PM IST

Updated : May 14, 2023, 3:41 PM IST

Assembly Elections Result 2023 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ విజయభేరి మోగించింది. 135 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మెజారిటీని సాధించింది. అధికార బీజేపీకి భంగపాటు తప్పలేదు. 66 స్థానాలతో సరిపెట్టుకుంది. జేడీఎస్​ 19 సీట్లు గెలవగా.. ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు. ఇక, 2018తో పోలిస్తే బీజేపీ పరిస్థితి మరింత దిగజారింది. అయితే, ఈసారి ఈ కాంగ్రెస్​, బీజేపీలకు రెబల్స్​ బెడద ఎక్కువైంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్స్​గా బరిలోకి దిగారు. కాంగ్రెస్​తో పోలిస్తే.. ఈ రెబల్స్​ వల్ల బీజేపీకి తీవ్ర నష్టం జరిగింది.

అమెరికా ప్రైమరీ విధానం ఫెయిల్
బీజేపీ విఫలమవడానికి మరో కారణం.. ఆ పార్టీ అనుసరించిన అమెరికా ప్రైమరీ విధానం. ఈసారి సిట్టింగ్‌ స్థానాల్లో అభ్యర్థుల మార్పుతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించాలని వ్యూహాలు రచించిన బీజేపీ.. అందులో భాగంగా మొత్తం 224 స్థానాల్లోని 72 చోట్ల కొత్త అభ్యర్థులను బరిలోకి దించింది. ఈ నిర్ణయం తమకు కలిసివస్తుందనుకున్న బీజేపీ.. రెబల్స్​ను బుజ్జగించడంలో విఫలమైంది. ఇక, దాదాపు 24 మంది రెబల్స్​ వల్ల కాంగ్రెస్​కు ఎదురుదెబ్బ తగిలింది. 13 మందికి పైగా రెబల్స్​ బీజేపీకి షాక్​ ఇచ్చారు.

బీజేపీ కొంపముంచిన రెబల్స్​..
దావనగెరె జిల్లా మాయకొండ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రొఫెసర్​ లింగన్నను కాదని బీజేపీ.. బసవరాజ్​ నాయక్​కు టికెట్​ ఇచ్చింది. దీంతో లింగన్న సహా టికెట్​ ఆశించిన మరో 10 మంది అభ్యర్థులు రెబల్స్​గా బరిలోకి దిగారు. ఓట్లు చీలడం వల్ల కాంగ్రెస్​ అభ్యర్థి కేఎస్​ బసవంతప్ప విజయం సాధించారు. ఇదే జిల్లాలోని చన్నగిరి అసెంబ్లీ స్థానంలో బీజేపీ సిట్టింగ్​ ఎమ్మెల్యేను అవినీతి ఆరోపణలతో లోకాయుక్త అరెస్టు చేసింది. దీంతో ఆయన కుమారుడు టికెట్​ అడిగినా.. వారినీ కాదని హెచ్​ఎస్​ శివకుమార్​ను బరిలోకి దింపారు. బీజేపీపై వ్యతరేకతతో కాంగ్రెస్​ అభ్యర్థి బసవరాజు వీ శివగంగ విజయం సాధించారు. చిత్రదుర్గ జిల్లాలోని హొసదుర్గ స్థానంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్​ స్థానంలో ఎస్ లింగమూర్తికి టెకెట్ ఇచ్చింది బీజేపీ. ఇండిపెండెంట్​గా బరిలోకి దిగారు శేఖర్. దీంతో కాంగ్రెస్​ అభ్యర్థి బీజీ గోవిందప్ప గెలుపొందారు.

ఇక దక్షిణ కన్నడ జిల్లాలోని పుట్టూరు నుంచి కూడా సిట్టింగ్​ ఎమ్మెల్యే సంజీవ్​ మథందుర్​ను కాదని ఆశ తిమ్మప్పకు టికెట్ ఇచ్చారు. హిందూ లీడర్​ అయిన అరుణ్​ పట్టిళ్ల కూడా టికెట్ ఆశించారు. టికెట్ దక్కకపోవడం వల్ల ఈ ఇద్దరు రెబల్స్​గా బరిలోకి దిగారు. ఈ పరిణామం కాంగ్రెస్​ అభ్యర్థి అశోక్​ కుమార్​ రాయ్​కు కలసివచ్చింది. చిక్కమంగళూరు జిల్లాలో ఎం​పీ కుమార్​ స్వామికి టికెట్​ నిరాకరించి దీపక్​ దొడ్డయ్యను బరిలోకి దింపింది బీజేపీ. దీంతో పార్టీకి రాజీనామా చేసి జేడీఎస్​ నుంచి బరిలోకి దిగారు కుమార స్వామి. హుబ్బళ్లి సెంట్రల్​ నుంటి టికెట్​ ఆశించి భంగపడ్డ బీజేపీ మాజీ ముఖ్యమంత్రి జగదీశ్​ శెట్టర్​, అత్తాని నుంచి టికెట్​ రాలేదని నిరాశ చెందిన లక్షణ సవాడి బీజీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్​లో జాయిన్ అయ్యారు.

రెబల్స్​తో భంగపడ్డ కాంగ్రెస్..
చిక్కబళ్లపుర్​ జిల్లా శిద్లఘట్ట అసెంబ్లీ స్థానం నుంచి రాజీవ్​ గౌడ పోటీచేశారు. టికెట్ ఆశించి నిరాశచెందిన వి మునియప్ప, అంజనప్ప రెబల్స్​గా బరిలోకి దిగారు. కాగా, వీరి కుమ్ములాటల మధ్య జేడీఎస్​ అభ్యర్థి బీఎన్ రవికుమార్​ విజయం సాధించారు. ఇక గడగ్​ జిల్లా శిరహట్టిలో సూజన్​ ఎన్​ దొడ్డమని కాంగ్రెస్​ నుంచి బరిలోకి దిగగా.. రామకృష్ణ దొడ్డమని రెబల్​గా పోటీ చేశారు. వీరిద్దరిపై బీజేపీ అభ్యర్థి రామప్ప సోబెప్ప లమయ్​ విజయం సాధించారు.

తుమకూరు జిల్లా కునిగల్​లో మాజీ ఎమ్మెల్యే రామస్వామి గౌడ రెబల్​గా పోటీ చేయగా.. కాంగ్రెస్​ అభ్యర్థి డాక్టర్ హెడ్​డీ రంగనాథ్​ విజయం సాధించారు. దావణగెర జిల్లాలోనూ అసంతృప్త సిట్టింగ్​ ఎమ్మెల్యే, మరో రెబల్​ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే హెచ్​పీ రాజేశ్​పై కొత్త అభ్యర్థి బీ దేవేంద్రప్ప గెలుపొందారు. ఇక బళ్లారి జిల్లా హరపనహళ్లిలో​ కాంగ్రెస్​ అభ్యర్థిగా ఎన్​ కోట్రేశ్ బరిలోకి దికారు. టికెట్ ఆశించి భంగపడ్డ కేపీసీసీ జనరల్​ సెక్రటరీ ఎమ్​పీ లతా మల్లికార్జున ఇండిపెండెంట్​గా పోటీచేశారు. దీంతో బీజేపీ సిట్టింగ్​ ఎమ్మల్యే జీ కరుణాకర రెడ్డిపై లత విజయం సాధించారు.

Last Updated : May 14, 2023, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details