5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ - అధికార పీఠం ఎవరిదంటే? - Cvoter Exit Poll 2023
Assembly Elections Exit Poll Results 2023 LIVE In Telugu : 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల.. ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో భాజపా అధికారం కైవసం చేసుకోవచ్చని పేర్కొన్నాయి. ఇక మిజోరంలో స్థానిక పార్టీల మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని చెబుతున్నాయి.
Assembly Elections Exit Poll Results 2023 LIVE : దేశంలో 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా ఎగ్జిట్ పోల్స్ తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల్లో భాజపా అధికార పీఠం దక్కించుకునే అవకాశం ఉందని పేర్కొన్నాయి.
మిజోరం విషయానికి వస్తే.. జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఇక్కడ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయని స్పష్టం చేశాయి.
ప్రస్తుతానికి... ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌లో భాజపా; ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌ల్లో కాంగ్రెస్; తెలంగాణలో కె చంద్రశేఖరరావు నేతృత్వంలోని బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నాయి. మిజోరంలో MNF పార్టీ అధికారంలో ఉంది. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు నవంబర్ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కానీ, తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే పట్టం! Madhya Pradesh Election Exit Poll Results 2023 :మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం రావచ్చని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నాయి. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ అధికారం దక్కించుకోవచ్చని అంటున్నాయి. అంటే మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఏమి చెబుతున్నాయంటే..
టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్
జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్
ఇండియా టీవీ-సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
టైమ్స్‌నౌ ఎగ్జిట్ పోల్స్
టీవీ9-భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్స్
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
80
బీజేపీ
138
ఇతరులు
12
సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
92
బీజేపీ
128
ఇతరులు
10
CSDS ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
72
బీజేపీ
141
ఇతరులు
17
ఏబీపీ-నీల్సన్ ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
కాంగ్రెస్
80
బీజేపీ
138
ఇతరులు
12
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ! Rajasthan Election Exit Poll Results 2023 :రాజస్థాన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అంటే రాజస్థాన్‌లో ఉన్న సంప్రదాయం ప్రకారం, ఈసారి కూడా అధికార మార్పిడి జరగవచ్చని పేర్కొన్నాయి. ముఖ్యంగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకే అధికారం రానుందని వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే..
టీవీ9- భారత్‌వర్ష్ ఎగ్జిట్ పోల్స్
యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్
జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
టైమ్స్‌నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్
పీ-మార్క్ ఎగ్జిట్ పోల్స్
Dainik Bhaskar Exit Polls
భాజపా 98-105
కాంగ్రెస్ 85-95
ఇతరులు 10-15
ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ కాంగ్రెస్‌కే అధికారం! Chhattisgarh Election Exit Poll Results 2023 :కాంగ్రెస్ పార్టీ ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
ఎగ్జిట్ పోల్స్ సంస్థ అంచనాలు ఇలా..
ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్‌లో కాంగ్రెస్ 41 నుంచి 53 స్థానాలు గెలుస్తుందని తేలింది. భాజపాకు 36 నుంచి 48 స్థానాలు రావొచ్చని, ఇతరులు 4 చోట్ల గెలుస్తారని అంచనా వేసింది.
జన్‌కీబాత్ అంచనా ప్రకారం ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ 42 నుంచి 53 స్థానాలు గెలుస్తుంది. బీజేపీ 34 నుంచి 45 స్థానాలు గెలిచే అవకాశముంది.
సంస్థ
ఇండియా టీవీ సీఎన్‌ఎక్స్
యాక్సిస్ మైఇండియా
టీవీ5 న్యూస్
పీపుల్స్ పల్స్
పార్టీ / సీట్లు
కాంగ్రెస్
46-56
40-50
54-66
54-64
బీజేపీ
30-40
36-46
29-39
29-39
ఇతరులు
3-5
1-5
0-2
0-2
తెలంగాణలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బ! Telangana Election Exit Poll Results 2023 :తెలంగాణలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీ అధికారం కోల్పోయే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ అధికారం చేపట్టనుందని పేర్కొన్నాయి. ఓల్డ్ సిటీలో AIMIM హవా చూపిస్తుందని, భాజపా మాత్రం పూర్తిగా చతికిల పడిందని తెలిపాయి.
సీఓటర్ ఎగ్జిట్ పోల్స్
ఇండియా టీవీ ఎగ్జిట్ పోల్స్
రేస్ ఎగ్జిట్ పోల్స్
CNN IBN Exit Polls 2023 : సీఎన్ఎన్ ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్.. బీఆర్‌ఎస్ 35 నుంచి 40 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 65 నుంచి 70 సీట్ల వరకు, బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తాయని అంచనా వేసింది. ఎంఐఎం 6 నుంచి 7, ఇతరులు 1 లేదా 2 స్థానాలు గెలవవచ్చని పేర్కొంది.
AARAA Exit Polls 2023 : ఆరా మస్తాన్ ప్రీ పోల్ సర్వే.. అధికార బీఆర్‌ఎస్ 41 నుంచి 49కి మాత్రమే పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 58 నుంచి 67 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది. ఇక బీజేపీ 5 నుంచి 7, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావొచ్చని తెలిపింది. పార్టీల వారీగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు 39.58 శాతం, కాంగ్రెస్‌కు 41.13 శాతం, బీజేపీ 10.47, ఇతరులకు 8.82 శాతం లెక్కన ఓట్ల శాతాలు ఉన్నట్లు ఆరా సంస్థ వెల్లడించింది. కామారెడ్డిలో బీజేపీ గెలిచే అవకాశముందని.. సీఎం కేసీఆర్ రెండో స్థానంలో ఉండొచ్చని చెబుతోంది.
ఆరా ఎగ్జిట్ పోల్స్
Jan ki Baat Exit Polls 2023 : జన్‌కీబాత్ సర్వే ప్రకారం.. కాంగ్రెస్ 48 నుంచి 64 చోట్ల గెలుస్తుందని అంచనా వేసింది. అధికార బీఆర్‌ఎస్ 40 నుంచి 55 స్థానాల్లో గెలవొచ్చని చెబుతోంది. అలాగే బీజేపీ 7 నుంచి 13 నియోజకవర్గాలు, మజ్లిస్ పార్టీ 4 నుంచి 7 చోట్ల గెలుస్తుందని వెల్లడించింది.
Chanakya Strategies 2023 :చాణక్య స్ట్రాటజీస్.. కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాధించబోతుందని అంచనా వేసింది. 67 నుంచి 78 నియోజకవర్గాల్లో హస్తం పార్టీ గెలవబోతుందని ఆ సంస్థ వెల్లడించింది. అధికార బీఆర్‌ఎస్ 22 నుంచి 31 చోట్ల, బీజేపీ 6 నుంచి 9 నియోజకవర్గాల్లో, ఎంఐఎం 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.
Peoples Pulse Exit polls 2023 : పీపుల్స్ పల్స్, సౌత్ ఫస్ట్ సర్వేలు.. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్‌కు 62 నుంచి 72 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి. బీఆర్ఎస్కు 35 నుంచి 46 సీట్లు రావొచ్చని.. మజ్లిస్ పార్టీ 6 నుంచి 7, బీజేపీ 3 నుంచి 8 స్థానాలు, ఇతరులు 1 నుంచి 2 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించాయి.
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
మిజోరంలో కాంగ్రెస్, బీజేపీలకు నో ఛాన్స్! Mizoram Election Exit Poll Results 2023 :మిజోరంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు అసలు ఛాన్సే లేదని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. స్థానిక పార్టీలైన జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) మధ్యనే హోరాహోరీ పోటీ ఉంటుందని పేర్కొన్నాయి.
ఇండియా టీవీ- సీఎన్‌ఎక్స్ ఎగ్జిట్ పోల్స్
పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
TV CNX Exit Polls :
పార్టీ
గెలిచే స్థానాలు
MNF
14 -18
ZPM
12 - 16
కాంగ్రెస్
8 - 10
బీజేపీ
0- 2
ABP NEWS and C Voter Exit Polls :
ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
MNF
15 -21
ZPM
12 - 18
కాంగ్రెస్
2 - 8
బీజేపీ
0 - 0
Jan Ki Baat Exit Polls :
జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్
పార్టీ
గెలిచే స్థానాలు
MNF
10 -14
ZPM
15 - 25
కాంగ్రెస్
5 - 9
బీజేపీ
0 - 2
సెమీ ఫైనల్స్! మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 3న వెల్లడికానున్నాయి. మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్‌గా రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.