నవంబర్ 2022 నుంచి తన కుమారుడితో పాటు కనిపించకుండా పోయిన అసోంకు చెందిన మహిళ పాకిస్థాన్ జైల్లో ప్రత్యక్షమయ్యింది. దీంతో ఆ మహిళ తల్లి.. తన కుమార్తెను ఎలాగైనా భారత్‌కు రప్పించాలని దిల్లీ హైకోర్టులు పిటిషన్ దాఖలు చేసింది.
అసలు ఏం జరిగిందంటే..
వాహిదా బేగం అనే మహిళ తన కుమారుడితో పాటు నాగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోంది. ఆమె భర్త మహ్మద్ మోసిన్ చనిపోయాడు. అనంతరం ఆమె తన రూ. 1.60 కోట్ల విలువైన ఆస్తిని అమ్మింది. ఆ తర్వాత నవంబర్ 10 నుంచి కుమారుడితో పాటు కనిపించడం లేదు. దీంతో ఆ మహిళ తల్లి అజిఫా ఖటూన్ నాగాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కానీ పోలీసుల నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
రెండు నెలలుగా కనిపించని అసోం మహిళ.. పాకిస్థాన్ జైలులో ప్రత్యక్షం.. హైకోర్ట్‌కు తల్లి!
తన కుమారుడితో పాటు కనిపించకుండా పోయిన అసోం మహిళ.. పాకిస్థాన్ జైలులో ప్రత్యక్షమయ్యింది. దీంతో తన కుమార్తెను, మనవడిని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని ఆమె తల్లి దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ఇదిలా ఉండగా, నవంబర్ 30న అజిఫాకు ఓ పాకిస్థాన్ లాయర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. అందులో.. ఆమె కుమార్తె, మనవడు పాకిస్థాన్ కెట్టా జిల్లా జైలులో ఉన్నారని తెలిపాడు. వాహిదా, పాకిస్థాన్‌లోని ఇండియన్ రాయబార కార్యాలయానికి కూడా లీగల్ నోటీసులు పంపిచానని చెప్పాడు. ఈ విషయం అజిఫా నాగాన్ పోలీసులకు చెప్పింది. అయినా వారు పట్టించుకోలేదని ఆరోపించింది. కాగా, పోలీసులతో సమస్య పరిష్కారం కాదని.. తన కుమార్తె, మనవడిని భారత్‌కు రప్పించాలని విదేశీ వ్యవహారాల శాఖ, పాక్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించింది. అయినా వారు స్పందించలేదు. దీంతో లాయర్ సహాయంతో దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసు విచారణ శుక్రవారం జరగనుంది.