అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గానూ 47 సీట్లకు శనివారం తొలి దశ పోలింగ్ జరగనుంది. భాజపా-ఏజేపీ కూటమి, కాంగ్రెస్ మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. అయితే ప్రధాన పోటీ మాత్రం భాజపా, కాంగ్రెస్ మధ్యే ఉండనుంది. మొదటి విడత పోలింగ్లో అసోం సీఎం, భాజపా నేత, సర్బానంద సోనోవాల్, అసెంబ్లీ స్పీకర్ హితేంద్రనాథ్ గోస్వామి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. ఈ కీలక స్థానాల్లో మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఉండటంతో పోటీ రవసత్తరంగా మారనుంది.
తొలి విడతలో మొత్తం 47 స్థానాలకు గానూ 264 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరి భవితవ్యాన్ని 81.09 లక్షల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 11,537 పోలీంగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 479 కేంద్రాల్లో మొత్తం మహిళా అధికారులే విధులు నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో నిబంధనల దృష్ట్యా ఓటర్లకు ఒక గంట అధిక సమయాన్ని కేటాయించారు. దివ్యాంగ ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఏఏ పార్టీలు ఎన్ని చోట్ల..
మొదటి దశకు జరిగే ఎన్నికల్లో భాజపా 39 స్థానాల్లో పోటీ చేస్తోంది. దాని మిత్రపక్షం అసోం గుణ పరిషత్ 10 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. వీటిలో రెండు స్థానాల్లో ఇరు పార్టీలు స్నేహపూర్వకంగా తలపడుతున్నాయి.
ప్రతిపక్ష కాంగ్రెస్ 43 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. దాని మిత్రపక్షాలు ఏఐయూడీఎఫ్, సీపీఐ(ఎంల్-ఎల్), ఆర్జేడీ, అంచాలిక్ గన మోర్చా(స్వతంత్రంగా) ఒక్కో స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
నూతనంగా ఏర్పాటైన అసోం జాతీయ పరిషత్ 41 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. 78 మంది స్వతంత్ర అభ్యర్థులున్నారు. కొత్తగా స్థాపించిన రాయ్జోర్ దళ్ అభ్యర్థులు 19మంది ఉన్నారు.
కీలక నేతలు..