ఇక నుంచి ఓ కుటుంబంలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అవుతారని అసోం ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ శనివారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలకు ఇద్దరు పిల్లల విధానాన్ని అనుసంధానం చేస్తున్నామని వెల్లడించారు.
అయితే ఈ నిబంధన రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాలకు వర్తించదని స్పష్టం చేశారు. ఈ నిబంధనను క్రమంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రవేశపెడతామని తెలిపారు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే దిశగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.