అసోంలో 'మహాబాహు-బ్రహ్మపుత్ర' ప్రాజెక్టును గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దాంతో పాటు ధుబ్రి-ఫుల్బారి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. మజులి వంతెన నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తోన్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నామటి-మజులి ద్వీపాలు, ఉత్తర గువాహటి-దక్షిణ గువాహటి, ధుబ్రి-హాట్సింగిమారి శిలాన్యాస్ల మధ్య (రో-పాక్స్) ప్రయాణికుల రవాణా నౌక కార్యకలాపాలను ప్రారంభించటం ద్వారా ఈ మహాబాహు-బ్రహ్మపుత్ర ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. వాటితో పాటు.. సులభతర వాణిజ్యంలో డిజిటల్ సొల్యూషన్స్‌ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. నాలుగు ప్రాంతాల్లో రూ.9.41 కోట్లతో నీమటి, బిస్వనాథ్ ఘాట్, పండు, జోగిఘోపాలను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు.