అసోం పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేమోజీ జిల్లాలోని శిలపతార్లో చమురు, గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభించి... జాతికి అంకితమిచ్చారు. వాటితో పాటు ఇంజినీరింగ్ కళాశాలలకూ శంకుస్థాపన చేశారు. అనంతరం.. కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ.. కేంద్రం, అసోం ప్రభుత్వం రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్రానికి గొప్ప సామర్థ్యం ఉన్నప్పటికీ.. గత ప్రభుత్వాలు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాయని ఈ సందర్భంగా చెప్పారు మోదీ. ఫలితంగా రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందని అన్నారు.
'గత ప్రభుత్వాల వల్లే అసోం వెనుకబడింది' - అసోం పర్యటనలో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తన అసోం పర్యటనలో భాగంగా చమురు, గ్యాస్ ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వాల పాలన వల్లే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు.
!['గత ప్రభుత్వాల వల్లే అసోం వెనుకబడింది' PM Narendra Modi inaugurates and lays the foundation stone of various projects in Assam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10726498-thumbnail-3x2-pm-modi.jpg)
అసోం పర్యటనలో పలు ప్రాజెక్ట్‌లను ప్రారంభించిన మోదీ
ఈ కార్యక్రమంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అసోం సీఎం సర్బానంద సోనోవాల్, గవర్నర్ జగ్దీష్ ముఖిలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నేషనల్ హెరాల్డ్ కేసు విచారణపై దిల్లీ హైకోర్టు స్టే