అసోం శాసనసభ ఎన్నికల మూడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మంగళవారం 40 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. ఆయా నియోజకవర్గాల నుంచి మొత్తం 337 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 54-పశ్చిమ గువాహటి నియోజకవర్గంలో అత్యధికంగా 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా... 48-బోకో ఎస్సీ నియోజకవర్గం నుంచి కనిష్ఠంగా ముగ్గురు బరిలో నిలిచారు.
అసోం మూడో దశ
- శాసన సభ స్థానాలు: 40
- మొత్తం అభ్యర్థులు: 337
- ఓటర్లు: 79,19,641
- పురుషులు: 40,11,539
- మహిళలు: 39,07,963
- ఇతరులు: 139
- మొత్తం జిల్లాలు: 11
- పోలింగ్ కేంద్రాలు: 11,401
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద తగిన జాగ్రత్తలు ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. కొవిడ్ బాధితులకు, దివ్యాంగులకు, 80 ఏళ్ల దాటిన వృద్ధులకు ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ పద్ధతిని అందుబాటులో ఉంచింది.