తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీర్పు పేరిట ఉన్మాదం.. ఒకరు సజీవ దహనం.. దోషి అంటూ గ్రామస్థుల 'శిక్ష'!

గ్రామ పంచాయతీలో జరిగిన బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని సజీవ దహనం చేశారు గ్రామస్థులు. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్లే చంపారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అసోం బోర్​లాలుగావ్​లో శనివారం జరిగింది.

man burnt by villagers
man burnt by villagers

By

Published : Jul 10, 2022, 12:43 PM IST

Updated : Jul 10, 2022, 2:25 PM IST

అసోం నాగోన్​ జిల్లాలో దారుణం జరిగింది. గ్రామ పంచాయతీలో జరిగిన బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని గ్రామస్థులు సజీవ దహనం చేశారు. ఈ ఘటన బోర్​లాలుగావ్​లో శనివారం జరిగింది. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్లే చంపారని పోలీసులు తెలిపారు. మృతుడిని బోర్​లాలుగావ్​కు చెందిన రంజిత్​ బొర్డొలొయిగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం మెజిస్ట్రేట్​ సమక్షంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. శరీరం 90 శాతం కాలిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు.

"బహిరంగ విచారణలో ఓ వ్యక్తిని సజీవ దహనం చేసినట్లు సమాచారం అందింది. ఓ మహిళ హత్య కేసులో దోషిగా తేలడం వల్ల హత్య చేసి పూడ్చి పెట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాం. కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం."

Last Updated : Jul 10, 2022, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details