తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చీరకట్టులోనే వరద ప్రాంతాల్లో పర్యటన.. ఐఏఎస్​ అధికారిణిపై ప్రశంసల వెల్లువ - Assam IAS

Assam IAS: పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీచేయించిన ఐఏఎస్‌ అధికారుల జంట నిర్వాకంపై సామాజిక మాధ్యమాల్లో.. భారీఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. అదే సోషల్ మీడియా వేదికగా ప్రజాసేవకై అంకిత భావంతో పనిచేస్తున్న  ఓ ఐఏఎస్ అధికారిణి వృత్తినిబద్ధతపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆమె కీర్తి జల్లి. ఆ వివరాలు ఈ కథనంలో చూద్దాం.

Assam Collector
చీరకట్టులోనే వరద ప్రాంతాల్లో పర్యటన.. కలెక్టర్​పై ప్రశంసల వెల్లువ

By

Published : May 28, 2022, 2:54 PM IST

Updated : May 28, 2022, 4:08 PM IST

Assam Collector: దేశ రాజధాని దిల్లీలో ఐఏఎస్ అధికారుల జంట సంజీవ్ ఖిర్వార్‌, ఆయన భార్య రింకూ దుగ్గా అధికార దుర్వినియోగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ అసోంలో ఓ ఐఏఎస్‌ అధికారిణి అంకితభావం అందరితోనూ ప్రశంసలు అందుకుంటోంది. కాలి నడకన బురదలో నడుచుకుంటూ వెళ్లి వరద ప్రభావిత ప్రాంత వాసుల కష్టాలను వింటున్న ఆమె వృత్తినిబద్ధతపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దిల్లీ ఐఏఎస్‌ అధికారుల జంటతో ఆమెను పోల్చుతూ కొనియాడుతున్నారు.

చీరకట్టులోనే వరద ప్రాంతాల్లో పర్యటన.. ప్రశంసల వెల్లువ

కీర్తి జల్లి. మన తెలుగు యువతే. అసోంలోని కఛార్‌ డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కీర్తి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారారు. అసోంను వరదలు ముంచెత్తుతున్న సమయంలో స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కీర్తి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. చీరకట్టులోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కీర్తి బురదలో సైతం నడుచుకుంటూ వెళ్లి బాధితుల గోడు విన్నారు.

చీరకట్టులోనే వరద ప్రాంతాల్లో పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల సాదకబాధకాలను ఓపిగ్గా విన్న కీర్తి జల్లి వారికి కావాల్సిన నిత్యావసరాలను సైతం పంపిణీ చేశారు. వరదల నుంచి ఆయా ప్రాంతాలను రక్షించేలా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెపై సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె అంకితభావం, వృత్తి నిబద్ధతను నెటిజన్లు కొనియాడుతున్నారు.

ఐఏఎస్​ అధికారిణిపై ప్రశంసల వెల్లువ

2013 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కీర్తి జల్లి స్వస్థలం వరంగల్ జిల్లా. ఐఏఎస్‌ పూర్తైన తర్వతా అసోంలో వివిధ బాధ్యతల్లో పనిచేసిన కీర్తి.. మహిళలు, శిశు మరణాలను తగ్గించడానికి, వారి ఆరోగ్యం, మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నారు. కొవిడ్ సమయంలో తన వివాహంతో కూడా వార్తల్లో నిలిచారు కీర్తి జల్లి. పెళ్లైన తర్వాత రోజే విధుల్లోకి వెళ్లి తన వృత్తినిబద్ధతను చాటుకున్నారు.

చీరకట్టులోనే వరద ప్రాంతాల్లో పర్యటించిన కీర్తి జల్లి
​ కీర్తి జల్లిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

ఇదీ చదవండి:ప్రజలు సిగ్గుతో తలవంచుకునే పని నేను చేయలేదు: మోదీ

Last Updated : May 28, 2022, 4:08 PM IST

ABOUT THE AUTHOR

...view details