పరీక్ష రాసేందుకు పొట్టి దుస్తులు(నిక్కర్) (Assam Girl News) వేసుకొచ్చిందనే కారణంతో ఓ యువతిని ఎగ్జామ్ హాల్లోకి అనుమతించలేదు అధికారులు. చాలా సేపు బయటే నిలిపేశారు. అసోం తేజ్పుర్లో(Tezpur Girl News) ఇటీవలే ఈ ఘటన జరిగింది. అసోం అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష రాసేందుకు ఆ యువతి (Assam Girl News) వెళ్లింది.
ఎగ్జామ్కు హాజరయ్యేందుకు అవసరమైన అన్నీ పత్రాలు తీసుకెళ్లినప్పటికీ సిబ్బంది తనను హాల్లోకి వెళ్లనివ్వలేదని యువతి తెలిపింది. ఎందుకు అని ప్రశ్నిస్తే నిక్కర్ వేసుకొని పరీక్ష రాయడానికి వీల్లేదని బదులిచ్చినట్లు పేర్కొంది. అడ్మిట్ కార్డులో అలాంటి నిబంధనేమీ లేదని, అయినా వారు తనను అనుమతించలేదని వాపోయింది.
అయితే సిబ్బంది మాత్రం అమ్మాయి ప్రవర్తనను(Assam Tezpur News Today) తప్పుబట్టారు. పరీక్ష రాసేందుకు నిక్కర్లు వేసుకురావొద్దనే నిబంధన లేకపోయినప్పటికీ సరైన దుస్తులతో రావాలనే కామన్ సెన్స్ వారికి ఉండాలని అసహనం వ్యక్తం చేశారు.