తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Assam flood: వరద విలయం.. 5.74 లక్షలమందిపై ప్రభావం! - అసోం వరదలు

భారీ వరదలు అసోంను(Assam flood news) అతలాకుతలం చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లో దాదాపు 5.74 లక్షలమందిపై ప్రభావం చూపాయి. ఇప్పటివరకు వరదల ధాటికి ఒకరు మృతిచెందారు.

Assam flood
వరద విలయం

By

Published : Sep 1, 2021, 5:09 AM IST

Updated : Sep 1, 2021, 6:51 AM IST

అసోంను వరదలు(Assam flood) ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావం(Assam flood news) రాష్ట్రంలో దాదాపు 5.74 లక్షల మందిపై పడినట్లు అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. వరదల ధాటికి ఇప్పటివరకు ఒకరు మృతిచెందినట్లు పేర్కొంది. నల్బరీ జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నది. 1.1లక్షల మందిపై ప్రభావం(Flood in Assam) చూపాయి.

వరదలో చిక్కుకున్న గుర్రం..
జల దిగ్బంధంలో కజిరంగా పార్కు
వరద నీటిలో ప్రజల అవస్థలు
వరదల ధాటికి దెబ్బతిన్న పంట

ఇప్పటికే రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సిబ్బంది.. జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన గ్రామాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మరోవైపు జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 1,018 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

పడవలోనే ప్రయాణం
బ్రహ్మపుత్ర ఉద్ధృతి
ఇళ్లలోకి చేరిన నీరు

వరదలు.. 16 జిల్లాల్లోని 3.53లక్షల జంతువులపై ప్రభావం చూపాయి. కజిరంగా జాతీయ పార్కు, పులుల సంరక్షణ కేంద్రం ఇప్పటికే 70శాతం నీటిలో మునిగిపోయింది.

ఇదీ చదవండి:Assam Flood: పోటెత్తిన వరదలు- 950 గ్రామాలు జలదిగ్బంధం

Last Updated : Sep 1, 2021, 6:51 AM IST

ABOUT THE AUTHOR

...view details