ఈశాన్య రాష్ట్రమైన అసోంలో తొలిదశ పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత, కొవిడ్ నిబంధనల నడుమ కొనసాగుతోంది. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
నాగావ్, దిబ్రూగఢ్ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. నాగావ్ జిల్లాలోని రుపాహి ప్రాంతంలో ఓటర్లు భారీగా క్యూ కట్టారు.
మజూలిలోని పోలింగ్ కేంద్రాల వద్ద భౌతిక దూరం పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఓటర్లు. దిబ్రూగఢ్‌లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు మాస్క్‌లు, చేతి తొడుగులు, శానిటైజర్ అందించారు అధికారులు.