తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీ పొడికి 'గోల్డ్'​ టచ్.. కిలో ధర రూ.2.5 లక్షలు - బంగారు రేకులతో టీ పొడి అసోం

సాధారణంగా కిలో టీ పొడి రూ.300కు పైగా ఉంటుంది. అదే అసోంకు చెందిన ఆరోమికా సంస్థ తయారు చేసిన బ్లాక్​ టీ పొడి కిలో ధర తెలిస్తే అవాక్కవుతారు. 24 క్యారెట్ల బంగారం జత చేసిన ఈ బ్లాక్​ టీ పొడి కిలో ధర రూ.2.5 లక్షలు. అయితే దీంతో పాటు వైవిధ్యమైన రుచులను అందించే మరెన్నో టీ పొడులు తయారు చేశామని కంపెనీ అధికారులు చెబుతున్నారు.

Assam Black Tea
Assam Black Tea

By

Published : Sep 2, 2022, 7:33 AM IST

Assam Black Tea : ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన టీ పొడికి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అసోంకు చెందిన ఆరోమికా టీ అనే అంకుర సంస్థ 40 రకాల వైవిధ్యమైన రుచులను అందిస్తోంది. అందులో ఒకటి.. తాగేందుకు అనువైన 24 క్యారెట్ల బంగారం జత చేసిన బ్లాక్‌టీ పొడి. దీని ధర కిలో రూ.2.5 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఘాటు మిరపకాయ అయిన 'భూత్‌ జోలాకియా' రుచితో సిద్ధం చేసిన పొడిని కూడా రూపొందించినట్లు ఆ కంపెనీ అధికారి రంజిత్‌ బారువా పేర్కొన్నారు.

అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో వినియోగదారులకు ఆరోగ్య స్పృహ పెరగడంతోపాటు ప్రత్యేక రుచుల కోసం ఎదురుచూస్తున్నారని.. అలాంటి వారి కోసమే 'ఆరోమికా టీ' బ్రాండ్‌ కింద 40కి పైగా ప్రత్యేక, విలాసవంత రుచులను సృష్టించామని తెలిపారు. 'భూత్‌ జోలాకియా' లేదా 'ఘోస్ట్‌ పెప్పర్‌' రుచితో అందిస్తున్న టీ కోసం పేటెంట్‌కు దరఖాస్తు చేశాం. దీంతో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయ’ని పేర్కొన్నారు. కాస్టస్‌ ఇగ్నిస్‌ మొక్క ఆకులతో చేసిన ప్రత్యేక 'ఇన్సులిన్‌' టీ పొడినీ కనిపెట్టినట్లు తెలిపారు. ఇది శరరీంలో చక్కెర స్థాయులను స్థిరపరుస్తుందని అంటున్నారు. 'మోరింగా', 'తులసి' రకాల పొడితో ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details