Assam DIG Cell Phone Snatched : రాష్ట్ర పోలీస్ డీఐజీ మొబైల్‌నే ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. బైక్‌పై వచ్చిన దొంగ.. మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన డీఐజీ నుంచి ఫోన్ చోరీ చేశాడు. పోలీస్ హెడ్క్వాటర్స్ సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆదివారం అసోంలో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (లా & ఆర్డర్) వివేక్ రాజ్ సింగ్ మొబైల్‌ను ఎత్తుకెళ్లాడు దొంగ.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని గుహవాటిలోని ఉలుబరి ప్రాంతంలోని మజార్ రోడ్లో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారుల నివాసాలు మజార్ రోడ్డుకు ఇరువైపుల ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే డీఐజీ మార్నింగ్ వాక్ చేస్తుండగా వచ్చిన దొంగ.. ఆయన ఫోన్‌ను ఎత్తుకెళ్లాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. మొబైల్ చోరీ దొంగలను పట్టుకునేందుకు ఓ టీం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా అయితే ఘటనపై మాట్లాడేందుకు పలువురు అధికారులు నిరాకరించారు.
పక్క ఊరి ట్రాన్స్ఫార్మర్ చోరీ పక్క ఊరి ట్రాన్స్ఫార్మర్ చోరీ..
transformer theft in uttar pradesh : ఓ గ్రామానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ను మరో గ్రామానికి చెందిన వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వరద నీటిలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను బోటుపై వచ్చి ఎత్తుకెళ్లారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లినట్లు నిందితులు చెబుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాయంగంజ్ ప్రాంతం పరిధిలోని మున్షీ నాగ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జులై 19న ఘటనపై గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల విచారణలో జితేంద్ర, దాల్ సింగ్, శివరామ్, మౌజిలాల్, రామ్ రాహిశ్తో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు మున్షీ నాగ్లా గ్రామంలో అమర్చిన 25 KVA ట్రాన్స్ఫార్మర్ను ఎత్తుకెళ్లినట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
చోరీకి ఇదే కారణం..
భారీ వర్షాల కారణంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో గంగానది పొంగిపొర్లుతోంది. చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే నగరియ బసోలా గ్రామంలో ఇటీవలే ఓ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులకు గ్రామస్థులు ఎంత మొరపెట్టుకున్న వారు స్పందించలేదు. ఇక చేసేది లేక సమస్యపై ఏకమైన గ్రామస్థులు.. మున్షీ నాగ్లా గ్రామానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ను బోటుపై వచ్చి ఎత్తుకెళ్లారు. వరదల కారణంగా ఆ ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరాఫరాను నిలిపివేశారు అధికారులు. దీంతో వారి సులభంగా పూర్తి అయింది.