తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గృహిణులకు ప్రతి నెల రూ.2000 : కాంగ్రెస్​ - అసోం ఎన్నికలు

కాంగ్రెస్​ అసోం ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ విడుదల చేశారు. అసోం రాష్ట్ర సంస్కృతిని కాపాడే విధంగా దీన్ని రూపొందిచినట్లు తెలిపారు. గృహిణులకు రూ.2వేలు, 200 యూనిట్ల వరకు ఉచిత్​ విద్యుత్​ అందిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో పేర్కొంది.

Assam: Congress leader Rahul Gandhi releases party manifesto for #AssamAssemblyElections2021 at party office in Guwahati.
ఆ రాష్ట్ర మేనిఫెస్టోను విడుదల చేసిన రాహుల్​

By

Published : Mar 20, 2021, 5:42 PM IST

Updated : Mar 20, 2021, 6:20 PM IST

అసోంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే గృహిణులకు నెలకు రూ.2,000 ఇవ్వనున్నట్లు కాంగ్రెస్​ ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అసోం ఎన్నికల హామీలను శనివారం గువాహటిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ విడుదల చేశారు.

అసోంలో కాంగ్రెస్​ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తోన్న రాహుల్​ గాంధీ..

అసోంలో అధికారంలోకి వస్తే ఐదు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించనున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో​ తెలిపింది. అంతేగాక.. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. వీటితో పాటు.. టీ తోటల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలను రూ.365 పెంచుతామని స్పష్టం చేసింది.

ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున విడుదల చేసిన మేనిఫెస్టో అయినప్పటికీ.. వాస్తవానికి ప్రజల మేనిఫెస్టో అని రాహుల్​ తెలిపారు. అసోం ప్రజల ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తోందన్నారు. విభిన్న సంస్కృతులకు నిలయమైన భారతదేశంపై ఆర్‌ఎస్‌ఎస్, భాజపాలు దాడి చేస్తున్నాయని ఆరోపించారు. ఈ దాడులను దేశ భాషలు, చరిత్ర, ఆలోచనలు, జీవన విధానంపై జరిగే దాడులుగా భావించాల్సి ఉంటుందన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్​ అసోం మేనిఫెస్టోను విడుదల చేశామని.. ఆ రాష్ట్ర భావాలు, సిద్ధాంతాలను కాంగ్రెస్​ సమర్థిస్తుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:'మోదీ హయాంలో వారి సంపదే వృద్ధి'

'సంపన్నుల కోసమే మోదీ పనిచేస్తున్నారు'

Last Updated : Mar 20, 2021, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details