తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశానికి ఐదు రాజధానులు అవసరం, సీఎం కీలక ప్రతిపాదన

భారత్​కు ఐదు రాజధానుల అవసరం ఉందని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అన్నారు. ఇన్ని రోజులు ఈశాన్య ప్రాంతాన్ని చులకనగా చూశారన్నారు. మోదీ వచ్చిన తర్వాత ఈశాన్య ప్రాంతం అద్భుత ప్రగతి సాధిస్తోందని వ్యాఖ్యానించారు.

Assam CM Proposes Five Capitals
Assam CM Himanta proposes five national capitals to end regional disparity

By

Published : Aug 29, 2022, 8:19 PM IST

Assam CM Proposes Five Capitals: ప్రాంతీయ భేదం తలెత్తకుండా దేశానికి ఐదు రాజధానులు ఉండాలని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రతిపాదించారు. ప్రతి జోనుకు ఒకటి చొప్పున ఐదు రాజధానులు అవసరమని అన్నారు. దిల్లీ ముఖ్యమంత్రితో ట్విట్టర్​లో మాటల యుద్ధం నడుస్తున్న సందర్భంగా ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

"నేను దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​తో మాట్లాడుతున్నాను. ఆయనకు పక్క రాష్ట్రాలను ఎగతాళి చేసే అలవాటు ఉంది. రాష్ట్రాల మధ్య ఉన్న భేదాలను తొలగించడానికి, కొన్ని రాష్ట్రాలు వేరే రాష్ట్రాలను ఎగతాళి చేయకుండా ఉండేందుకు, భారత్​కు ఐదు రాజధానులు ఉంటే ఎలా ఉంటుంది? " అని ట్వీట్​ చేశారు. మరో ట్వీట్​లో "ఇలా చేస్తే దిల్లీ లాంటి ప్రభుత్వాల వద్ద ఎక్కువ సంపద కేంద్రీకృతం కాకుండా ఉంటుంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో తక్కువ ఉండకుండా ఉంటుంది. విద్య, వైద్యం లాంటి రంగాల్లో గత ఏడు దశాబ్దాల్లో చూడనంత అభివృద్ధి, నరేంద్ర మోదీ ఆశీర్వాదంతో చూడగలుగుతున్నాం. ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి పథంలో నడిపే కార్యక్రమం 2014లో మొదలై.. అద్భుత ప్రగతి దిశగా సాగుతోంది. ఈశాన్య భారతానికి ఎవరి జాలి అవసరం లేదు. గౌరవం, వనరులు, పునరుత్తేజం కావాలి" అని చెప్పారు.

ఇటీవల ఇరువురు ముఖ్యమంత్రులు ట్విట్టర్​లో మాటల యుద్ధానికి దిగారు. అసోంలో పాఠశాలల విలీనం కారణంగా కొన్ని విద్యాసంస్థలు మూసేయాల్సి వస్తోందని కేజ్రీవాల్​ అన్నారు. దానికి హిమంత బదులిస్తూ.. కేజ్రీవాల్​ ఎ్పప్పటిలాగే హోం వర్క్ చేయకుండా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. ఆయన, తాను ముఖ్యమంత్రి అయిననుంచి చేసిన మంచిని మరచిపోయారన్నారు. ఈ వ్యాఖ్యలకు బదులిస్తూ మనీశ్​ సిసోదియా.. తాను అసోం ప్రభుత్వం చేసిన మంచి పనులను చూడాలనుకుంటున్నాను అని అన్నారు. దానికి బదులిచ్చిన హిమంత.. ఇప్పటికే సిసోదియాకు కోర్టు సమ్మన్ల రూపంలో ఆహ్వానం పంపించామని ఎద్దేవా చేశారు. అప్పటి నుంచి హిమంత, కేజ్రీవాల్​ మధ్య వారం రోజుల నుంచి వార్ కొనసాగుతోంది. ఆదివారం అసోం సీఎం స్పందిస్తూ.. కేజ్రీవాల్​ దిల్లీని అసోం, ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న నగరాలతో పోల్చుతున్నారన్నారు. కానీ ఆయన మాత్రం దిల్లీని లండన్, పారిస్​లా మర్చుతానని హామీ ఇచ్చి విఫలమయ్యాడని విమర్శించారు.

ఇవీ చూడండి:మణప్పురంలో భారీ దోపిడీ, నిమిషాల్లోనే 24కిలోల గోల్డ్, 10లక్షల క్యాష్ చోరీ

టోల్​ప్లాజాపైకి దూసుకెళ్లిన బస్సు, లోపల ఉన్న సిబ్బంది ఒక్కసారిగా

ABOUT THE AUTHOR

...view details