అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ(Assam Cm Himanta Biswa Sarma).. ఓ కొత్త నియమాన్ని అమలులోకి తీసుకువచ్చారు. కేబినెట్లో ప్రతి మంత్రికి కొందరు ఎమ్మెల్యేలను అప్పజెప్పారు. మంత్రులు తమ ఎమ్మెల్యేల బృందంతో నిరంతరం చర్చలు జరిపేలా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆ రాష్ట్రంలో మంత్రులకు నయా 'రూల్' - అసోం కొత్త రూల్స్ న్యూస్
ప్రతీ మంత్రికి.. ఎమ్మెల్యేలతో కూడిన బృందాన్ని అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ప్రతీ 2,4 మంగళవారాల్లో వారందరూ కలిసి భోజనాలు చేసి.. స్థానిక ప్రజల సమస్యలను మంత్రులకు వివరించాలని ఆదేశించారు.
అసోం గణ పరిషత్, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ఎమ్మెల్యేలను కూడా ఈ మంత్రుల బృందంలో చేర్చినట్లు హిమంత పేర్కొన్నారు. నెలలో.. ప్రతీ రెండు, నాలుగో మంగళవారాల్లో తమ బృందంలోని ఎమ్మెల్యేలను.. మంత్రులు భోజనానికి ఆహ్వానించాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేలు తమ ప్రాంతంలోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయమేమిటో తెలపాలని సూచించారు. ఈ విధంగా మంత్రుల నుంచి వివరాలు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రికి చేరుతాయని హమంత అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి:'మైనారిటీలూ.. కుటుంబ నియంత్రణ పాటించండి'