అసోం నూతన సీఎంగా హిమంత బిశ్వ శర్మ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజభవన్లో జరిగే కార్యక్రమంలో ఆయనతో పాటు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. తనను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్‌కు హిమంత కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, సరైన పాలన అందిస్తానని చెప్పారు.
వారం రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ గువాహటిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో హిమంతను ఎన్డీఏ శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ కూటమి పార్టీల నేతలు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సహా పార్టీ పరిశీలకులు పాల్గొన్నారు.
భేటీ పూర్తయ్యాక నేరుగా రాజ్‌భవన్ వెళ్లి అసోం గవర్నర్ జగదీశ్ ముఖిని కలిశారు హిమంత. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మద్దతు తనకు ఉందని భాజపా, ఏజీపీ, యూపీపీఎల్ ఎమ్మేల్యేలు సంతకాలు చేసిన లేఖను సమర్పించారు. అనంతరం హిమంతను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతిపక్షాల శుభాకాంక్షలు..