Assam Boat Capsize : అసోంలో ఘోర ప్రమాదం జరిగింది. పాఠశాల విద్యార్థులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటన ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో జరిగింది. ప్రమాద సమయంలో ఓ ప్రభుత్వ అధికారి సహా 100 మంది ప్రయాణికులు, 10 మోటార్ సైకిళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అయితే.. పడవలో 30 మంది ప్రయాణికులు ఉన్నారని.. ఏడుగురు గల్లంతయ్యారని ధుబ్రి డిప్యూటీ కమిషనర్ వెల్లడించారు.
పాఠశాల విద్యార్థుల పడవ బోల్తా.. అనేక మంది గల్లంతు - అసోం పడవ ప్రమాదం
Assam Boat Capsize : పాఠశాల విద్యార్థులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటన అసోం ధుబ్రి జిల్లాలోని బ్రహ్మపుత్ర నదిలో జరిగింది. ప్రమాద సమయంలో ఓ ప్రభుత్వ అధికారి సహా 100 మంది ప్రయాణికులు, 10 మోటార్ సైకిళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు.

Assam Boat Capsize
ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు 15 మందిని రక్షించామని అధికారులు చెప్పారు. సర్వేకు వెళ్లిన ఓ ప్రభుత్వ అధికారి సహా విద్యార్థుల ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు.