తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నదిలో మునిగిన పడవ.. 9 మందిలో నలుగురు... - నదిలో మునిగిన పడవ

బ్రహ్మపుత్ర నదిలో పడవ మునిగిపోయింది. మొత్తం 9 మందితో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. అసోంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు గల్లంతయ్యారు.

ASSAM BOAT CAPSIZE
ASSAM BOAT CAPSIZE

By

Published : Jun 19, 2022, 7:11 PM IST

ASSAM BOAT CAPSIZE: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ మనిగిపోయింది. 9 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ దిబ్రూగఢ్​లో జిల్లాలోని రొమోరియా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.

సహాయక చర్యలను చూసేందుకు వచ్చిన స్థానికులు

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్​డీఆర్ఎఫ్, ఎస్​డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. గల్లంతైన వారిని శంకర్ యాదవ్, శంకర్ కుర్మి, ధామెన్ దాస్, కిచన్ యాదవ్​గా గుర్తించారు.

సిబ్బంది సహాయక చర్యలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details