తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'తాజ్​మహల్, కుతుబ్ మినార్​ను కూల్చేయండి.. అక్కడ ఆలయాలు కట్టండి'.. బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్ - BJP MLA Rupjyoti Kurmi sensational statement

బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్​, కుతుబ్ మినార్​లను కూల్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్​సీఈఆర్​టీ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర పాఠాలు తొలగించిన నేపథ్యంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

assam-bjp-mla-calls-for-demolish-qutub-minar-and-taj-mahal
తాజ్‌మహల్ కుతుబ్​ మినార్ కూల్చివేయాలన్న భాజపా ఎమ్మె ల్యే

By

Published : Apr 6, 2023, 10:49 PM IST

ఎన్​సీఈఆర్​టీ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర పాఠాలు తొలగించిన నేపథ్యంలో అసోంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్​, కుతుబ్ మినార్​లను కూల్చి వేయాలని పిలుపునిచ్చారు. ఆ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మరియానీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రూప్​జ్యోతి కుర్మీ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్, కుతుబ్ మినార్​లు ఉన్న చోట ఆలయాలు నిర్మిస్తే తన ఏడాది వేతనాన్ని విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

అసెంబ్లీ ఆవరణలోనే ఈ వ్యాఖ్యలు చేశారు రూప్​జ్యోతి కుర్మీ. ఎన్​సీఈఆర్​టీ సిలబస్ నుంచి మొఘలుల చరిత్రను తొలగించడాన్ని ఆయన స్వాగతించారు. మొఘలుల కాలంలో నిర్మించిన కట్టడాలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుతుబ్ మినార్, తాజ్​మహల్​ కట్టడాలను కూల్చి వేయాలని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లో అతిపెద్ద దేవాలయాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. బుధవారం సైతం ఎమ్మెల్యే కుర్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లూటీలు, దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో తాజ్​మహల్​ను నిర్మించారని సంచలన ఆరోపణలు చేశారు. షాజహాన్ ప్రేమ విషయంపైనా దర్యాప్తు చేయాలంటూ చెప్పుకొచ్చారు.

"తాజ్ మహల్​ను షాజహాన్.. ముంతాజ్​ కోసం కట్టించాడని చెబుతారు. అలాంటప్పుడు ముంతాజ్​ కాకుండా షాజహాన్ మరో ముగ్గురు మహిళలను ఎందుకు పెళ్లాడాడు. ముంతాజ్​కు, షాజహాన్​కు మధ్య ఉన్న సంబంధంపై విచారణ జరపాలి."
-రూప్​జ్యోతి కుర్మీ, బీజేపీ ఎమ్మెల్యే

రూప్​జ్యోతి కుర్మీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఓ న్యాయవాది పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. గువాహటిలోని లతాశీల్ స్టేషన్​లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. రూప్​జ్యోతి కుర్మీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైనవని గువాహటి హైకోర్టు న్యాయవాది తైజుద్దీన్ అహ్మద్ అన్నారు. ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఎమ్మెల్యే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన సీడీని సైతం పోలీసులకు అందించారు.

ఇటీవలే ఎన్​సీఈఆర్​టీ సిలబస్​లో పలు మార్పులు జరిగాయి. మొఘలుల చరిత్ర, గాంధీ హత్య, ఆరెస్సెస్​పై బ్యాన్ వంటి పాఠ్యాంశాలను సిలబస్ నుంచి తొలగించారు. గుజరాత్ అల్లర్లు, హిందూ ముస్లిం ఐక్యతకు గాంధీ చేసిన కృషి, దాని వల్ల హిందూ అతివాదుల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం వంటి పాఠాలను పుస్తకాల నుంచి తీసేశారు. సిలబస్​ను హేతుబద్ధీకరించడంలో భాగంగానే వీటిని తొలగిస్తున్నట్లు ఎన్​సీఈఆర్​టీ చెప్పుకొచ్చింది.

అయితే, ఈ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. గాంధీజీ చరిత్రను పాఠ్యాంశాల నుంచి తొలగించడాన్ని తప్పుబట్టింది. చరిత్రను తుడిచిపెట్టేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. చరిత్రను మార్చేందుకు ప్రయత్నించే వారంతా.. చరిత్రలో కలిసిపోతారంటూ ధ్వజమెత్తింది. అధికార బీజేపీ మాత్రం ఎన్​సీఈఆర్​టీకి మద్దతు పలికింది. కాంగ్రెస్ పార్టీ... ఎమర్జెన్సీ, కశ్మీర్ పండిట్లు, సిక్కుల ఊచకోత వంటి పాఠ్యాంశాలను సిలబస్​లో చేర్చలేదని.. ఆ పార్టీయే చరిత్రను వక్రీకరించిందని ఎదురుదాడికి దిగింది.

  • ఇవీ చదవండి:
  • CBSE పరీక్షల్లో కీలక మార్పు.. మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలకే ఎక్కువ మార్కులు!
  • ఒకప్పుడు ప్యూన్.. ఇప్పుడు రెండు ఐటీ కంపెనీలకు బాస్.. రూ.కోట్ల టర్నోవర్!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details