తెలంగాణ

telangana

By

Published : May 9, 2021, 12:26 PM IST

Updated : May 9, 2021, 1:40 PM IST

ETV Bharat / bharat

హిమంతను సీఎంగా ఎన్నుకున్న భాజపా శాసనపక్షం

assam-bjp-legislature-party-meeting-live-updates-leader-to-choose-new-cm
హిమంతను సీఎంగా ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు!

13:20 May 09

అసోం తదుపరి ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మను ఎన్నుకున్నారు భాజపా శాసనసభ్యులు. ఏకగ్రీవంగా ఆయన్ను సీఎం పదవికి ఎంపిక చేశారు. 

ఇదివరకు రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన సర్బానంద సోనోవాల్​ను కాదని.. ఆర్థిక మంత్రిగా పనిచేసిన హిమంత బిశ్వశర్మ పేరును ఖరారు చేసింది భాజపా అధిష్ఠానం. సంక్షోభ పరిష్కర్తగా పేరున్న ఆయనవైపే మొగ్గు చూపింది.

అసోంతో పాటు ఈశాన్య ప్రాంతంలో తొలిసారి భాజపా గణనీయంగా పుంజుకోవడానికి శర్మనే కారణంగా చెబుతారు. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు సన్నిహితుడిగా మెలుగుతూ, చిన్న రాష్ట్రాలైన మణిపుర్​, మేఘాలయాలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి.. తానేంటో నిరూపించుకున్నారు శర్మ. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు ఆయనపై మంచి గురి ఉంది. దీంతో చివరకు ముఖ్యమంత్రి పదవి ఆయననే వరించింది.

12:06 May 09

లైవ్: అసోంలో భాజపా శాసనపక్ష సమావేశం

అసోం ముఖ్యమంత్రిని ఎంపిక చేసే భాజపా శాసనపక్ష సమావేశానికి పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా అసెంబ్లీకి చేరుకుంటున్నారు. కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, భాజపా జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ సహా పార్టీ పరిశీలకులు అసెంబ్లీకి చేరుకున్నారు. 

ఇప్పటికే హిమంత బిశ్వశర్మను అసోం సీఎంగా భాజపా ఖరారు చేయగా.. ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో అధికారికంగా ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ ఆయన పదవికి రాజీనామా చేశారు.

సర్బానంద సోనోవాల్, హిమంత బిశ్వశర్మ మధ్యే సీఎం పదవికి పోటీ ఏర్పడింది. దిల్లీలో భాజపా అధిష్ఠానంతో పలు దఫాలుగా వీరు భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం పదవి కోసం ఇద్దరూ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. సీఎం పదవిపై భారీ ఆశలు పెంచుకున్న హిమంత రాజీ పడేందుకు ససేమిరా అన్నట్లు ప్రచారం జరిగింది.

Last Updated : May 9, 2021, 1:40 PM IST

ABOUT THE AUTHOR

...view details